IND vs NZ: ఎలా పట్టావు మామ ఆ క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ మనిషివా.. సూపర్ మ్యాన్ వా ! వీడియో

Glenn Phillips: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-ఇండియా ఫైనల్లో శుభ్‌మన్ గిల్ ను అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్ తో గ్లెన్ ఫిలిప్స్ అవుట్ చేశాడు. 

IND vs NZ CT 2025 Final Glenn Phillips Stuns with One Handed Catch in telugu rma

IND vs NZ champions trophy 2025: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి తన అద్భుతమైన క్యాచ్‌తో క్రికెట్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్ తో అవుట్ చేశాడు. 

ఇండియా ఛేజింగ్ చేస్తున్నప్పుడు 19వ ఓవర్లో ఈ వికెట్ పడింది. శుభ్‌మన్ గిల్ మిచెల్ సాంట్నర్ బంతికి కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బౌండరీకి వెళ్తుండగా ఫిలిప్స్ కుడివైపుకు డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. బంతి తనను దాటుకుంటూ వెళ్తున్నట్లు అనిపించడంతో గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి కుడిచేతిని చాపి క్యాచ్ పట్టాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అలా క్యాచ్ పట్టడంతో గిల్ షాక్ అయ్యాడు. ఒక్కసారిగా అక్కడున్న వారు కూడా ఎలా పట్టాడో అర్థంకాక షాక్ ఆశ్చర్యపోయారు. 

క్యాచ్ పూర్తయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఫిలిప్స్ క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

చూడండి: గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ 

 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 252 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియాకు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్నిచ్చాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతూ న్యూజిలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టారు. కానీ, మిచెల్ సాంట్నర్ గిల్ వికెట్ తీయడంతో 105/1 వద్ద ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. గిల్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ కూడా వెంటనే అవుటయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ అతన్ని ఒకే పరుగుకు అవుట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మతో శ్రేయాస్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో టామ్ లాథమ్ స్టంపింగ్ చేయడంతో 76 పరుగుల వద్ద రోహిత్ అవుటయ్యాడు. 

ఈ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, గిల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లు కీలకమైన ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు విజయాన్ని అందించారు. రోహిత్ 76 పరుగులు, గిల్ 31 పరుగులు, అయ్యర్ 48 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. అలాగే, అక్షర్ పటేల్ 29 పరుగులు, హార్దిక్ 18 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. కేఎల్ రాహుల్ 34 పరుగులతో భారత్ ను విజయం పైపు నడిపించాడు. 4 వికెట్ల తేడాతో కీవీస్ పై భారత్ విజయం సాధించింది.  రవీంద్ర జడేజా ఫోర్ తో మ్యాచ్ విన్నింగ్ రన్స్ కొట్టాడు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios