Rohit Sharma - Shubman Gill : ధర్మశాలలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో భారత ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. శివరాత్రి రోజున శివాలెత్తిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో అదరగొట్టారు.
IND vs ENG : భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత్ ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. శివరాత్రి రోజున శివాలెత్తారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ సెంచరీల మోత మోగించారు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతో సెంచరీ సాధించాడు. 154 బంతుల్లో 100 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. టెస్టు కెరీర్ లో 12 సెంచరీని సాధించాడు.
రోహిత్ శర్మ సెంచరీ చేసిన వెంటనే టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ కూడా తర్వాతి ఓవర్ లోనే సెంచరీ కొట్టాడు. సూపర్ సిక్స్ తో తన సెంచరీ పరుగులను కూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ 101 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గిల్ తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 264/1 (60) పరుగులతో రోహిత్ శర్మ (102*), గిల్ (101*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్ కు 46 పరుగుల అధిక్యం లభించింది.
Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ సాధించలేదని జైస్వాల్ చేశాడు.. !
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. మంచి ఆరంభం లభించింది కానీ, తొలి వికెట్ పడిన తర్వాత వరుసగా ఇంగ్లాండ్ ప్లేయర్లు పెవిలియన్ కు బాటపట్టారు. భారత్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కుప్పకూల్చింది. కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4, జడేజాకు ఒక వికెట్ దక్కింది. 218 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ కాగా, జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం చేసింది. తొలి రోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ దెబ్బకు ఇంగ్లాండ్ దిమ్మదిరిగిపోయింది ! హిట్ మ్యాన్ సూపర్ సెంచరీ
