Rohit Sharma: ధర్మశాలలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో భారత ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.
IND vs ENG - Rohit Sharma : భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత్ ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. 154 బంతుల్లో 100 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. టెస్టు కెరీర్ లో 12 సెంచరీని సాధించాడు.
Scroll to load tweet…
రోహిత్ శర్మ సెంచరీ చేసిన వెంటనే టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ కొట్టాడు. సూపర్ సిక్స్ తో తన సెంచరీ పరుగులను కూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ 101 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గిల్ తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.
Scroll to load tweet…
