IND vs ENG: అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్.. భార‌త్ లో ఒకేఒక్క బౌల‌ర్ గా అశ్విన్ రికార్డు !

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్, కుల్దీప్ యాద‌వ్ అద్భుత బౌలింగ్ తో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 120 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే అశ్విన్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. 
 

IND vs ENG: Ravichandran Ashwin breaks legendary bowler Anil Kumble's record, becomes the highest Test wicket-taker in India RMA

India vs England : భార‌త స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ మూడో రోజు మ‌రో రెండు వికెట్లు తీసుకుని స‌రికొత్త ఘ‌న‌త సాధించాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. ఈ క్ర‌మంలో భార‌త దిగ్గ‌జ బౌల‌ర్ అనిల్ కుంబ్లేను అధిగమించాడు.

రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు సమాధానంగా భారత్ 307 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 177 పరుగుల వద్ద ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్ మైదానంలో నిలదొక్కుకుని 76 పరుగులు జోడించ‌డంతో భార‌త్ 300+ మార్కును అందుకుంది. కుల్దీప్ (28)ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేయ‌గా, ధృవ్ జురెల్ సెంచరీకి ద‌గ్గ‌ర ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఇంగ్లాండ్  బౌల‌ర్ షోయబ్ బషీర్ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్‌గా ఆకాష్ దీప్ (9)ను పెవిలియ‌న్న కు పంపాడు. 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగుల వద్ద జురెల్ ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ను 307 పరుగులకు ముగించిందిత‌. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సాధించింది.

షోయబ్ బషీర్ 119 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. భారత్‌లో టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన రెండో యువ బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు 1996లో పాల్ ఆడమ్స్ (19 ఏళ్ల 233 రోజులు) ఈ ఘనత సాధించాడు. బషీర్ రాంచీలో ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్ గా నిలిచాడు. అంత‌కుముందు రవీంద్ర జడేజా 5-124 vs ఆస్ట్రేలియా, 2017 లో ఐదు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను భార‌త బౌల‌ర్లు దెబ్బ‌కొట్టారు. భార‌త ప్లేయ‌ర్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ 120 ప‌రుగుల‌కు  5 వికెట్లు కోల్పోయి ఆట‌ను కొన‌సాగిస్తోంది. భార‌త స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మ‌రోసారి ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దెబ్బతీశాడు.

రాంచీలో 19 ప‌రుగుల వ‌ద్ద అశ్విన్ తొలి వికెట్ గా బెన్ డ‌కెట్ ను పెవిలియ‌న్ కు పంపాడు. ఆ త‌ర్వాత ఓలీ పోప్ డ‌కౌట్ చేయ‌గా, బెన్ స్టోక్స్ 11 ప‌రుగుల వ‌ద్ద అశ్విన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక్క‌డ రెండు వికెట్లు తీసుకున్న త‌ర్వాత అశ్విన్ మ‌రో రికార్డు న‌మోదుచేశాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్ అనిల్ కుంబ్లే రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ.. భార‌త్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఆర్ అశ్విన్ ద్వారా స్వదేశంలో ఇది 350వ వికెట్ బెన్ డ‌కెట్ కాగా, ఆ తర్వాతి బంతికే అశ్విన్ ఒల్లీ పోప్ (0)ని పెవిలియ‌న్ కు పంపి కుంబ్లే ద్వారా(350) రికార్డ్ ను బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ (351) నాలుగో స్థానంలో ఉండ‌గా, శ్రీలంక దిగ్గ‌జం ముత్తయ్య మురళీధరన్ (493) టాప్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ ప్లేయ‌ర్లు జేమ్స్ అండర్సన్ (434), స్టువర్ట్ బ్రాడ్ (398)  ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios