Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: ఉత్కంఠ‌ను పెంచుతున్న‌ రాజ్‌కోట్ టెస్టు.. ఇంగ్లాండ్ టీమ్ లోకి స్టార్ బౌల‌ర్ !

India-England Test : రాజ్ కోట్ వేదికగా భారత్ తో ఇంగ్లాండ్ జ‌ట్టు మూడో టెస్టులో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ మార్క్ వుడ్ జ‌ట్టులోకి తిరిగివ‌చ్చాడు. 
 

IND vs ENG: Rajkot Test raises the excitement.. Star bowler Mark Wood's entry into England squad RMA
Author
First Published Feb 14, 2024, 4:29 PM IST | Last Updated Feb 14, 2024, 4:29 PM IST

India-England Test : రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో  భార‌త్ -ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు ఒక్కోమ్యాచ్ గెల‌వ‌డంతో 1-1తో స‌మంగా ఉన్నాయి. మూడో టెస్టులో ఇరు జ‌ట్ల‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ టీమ్ మూడో టెస్టు స్వాడ్ ను ప్ర‌క‌టించింది. ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఇంగ్లాండ్ సీమర్ మార్క్ వుడ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.

మార్క్ వుడ్ హైదరాబాద్‌లో ఏకైక స్పెషలిస్ట్ సీమర్‌గా ఈ సిరీస్ లో తొలి టెస్టు ఆడాడు. వైజాగ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సోయ‌బ్ బషీర్ ను జ‌ట్టు నుంచి త‌ప్పించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్‌లతో సహా నాలుగు వికెట్లు అత‌ను పడగొట్టాడు . "మార్క్ వుడ్‌ను చేర్చుకోవడంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. రాజ్ కోట్ పిచ్ నిజమైన ఫ్లాట్ వికెట్ ఉంటుంది. మంచి వికెట్‌గా కనిపిస్తోంది. అదనపు సీమర్ మాకు గెలవడానికి ఉత్తమ అవకాశాన్ని అందిస్తారు" అని తెలిపారు.

IND vs ENG : రాజ్‌కోట్ లో గెలుపు మ‌న‌దేనా..? గ‌త రికార్డులు, పిచ్ రిపోర్టులు

సోయ‌బ్ బషీర్ తన తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్‌లో కూడా మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. అదనపు సీమర్‌ని కలిగి ఉండటం వల్ల మేము మొదటి టెస్ట్‌లో ఉపయోగించిన దానికంటే భిన్నంగా మార్క్ వుడ్ ను ఉపయోగించుకోవచ్చ‌ని బెన్ స్టోక్స్ తెలిపాడు. అండర్సన్ త‌న తన క్లాస్‌ని చూపించాడని కూడా పేర్కొన్నాడు.

మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (సి), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. 

IPL 2024: రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios