IND vs ENG: రోహిత్ శర్మ చేయలేనిది కుల్దీప్ చేశాడు ! ఇంగ్లాండ్ బ్యాండ్ వాయించాడు.. !

India vs England : భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో కుల్దీప్ యాద‌వ్ అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతున్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాంచీలో దుమ్మురేపాడు. త‌న ఆట‌తో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడ‌కున్నాడు.
 

IND vs ENG: Kuldeep Yadav did what Rohit Sharma couldn't, took 4 wickets to beat England RMA

India vs England : రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద‌ర‌గొట్టింది. మ‌న బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ ముందు 191 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుపున కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతం చేశాడు. రాంచీలోని తక్కువ బౌన్స్ పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, కుల్దీప్ యాద‌వ్ తనదైన ఆట‌తో గ్రౌండ్ లో నిలిచాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 300+ ప‌రుగుల మార్కును అందుకోవ‌డంలో కీల‌కంగా ఉన్నారు. ధృవ్ జురెల్‌తో కలిసి 76 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు. 131 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్‌ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు ఫోర్లు కూడా బాదాడు.

కుల్దీప్ తన బ్యాటింగ్ కంటే స్పిన్ బౌలింగ్‌కే ఎక్కువ పేరు తెచ్చుకున్నప్పటికీ, అతనికి అవకాశం దొరికినప్పుడల్లా, త‌న బ్యాటింగ్ తోనూ జట్టుకు సహకారం అందిస్తున్నాడు. రాంచీ టెస్టులో కూడా అలాంటిదే చూపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్ కూడా మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు త‌క్కువ  ప‌రుగుల‌కే దొరికిపోగా, కుల్దీప్ మాత్రం త‌న మార్కును చూపించాడు.

 

బౌలింగ్ లోనూ దుమ్మురేపాడు.. 

రాంచీ టెస్టులో కుల్దీప్ యాద‌వ్ బ్యాట్ తో పాటు బౌలింగ్ లోనూ దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను చెడుగుడు అడుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి  22 ప‌రుగుల మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, ఓలీ రాబిన్స‌న్ ను పెవిలియ‌న్ కు పంపాడు. అంత‌కుముందు, తొలి ఇన్నింగ్స్ లో కూడా మంచి బౌలింగ్ వేశాడు. 2 కంటే త‌క్కువ ఎకాన‌మీతో బౌలింగ్ చేశాడు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios