Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ రికార్డులు సమం.. రోహిత్ శర్మ రికార్డుల మోత !

Rohit Sharma: ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ లో భార‌త్ గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్ లో సెంచ‌రీ కొట్టిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఘ‌న‌త సాధించ‌డంతో పాటు దిగ్గ‌జ ప్లేయ‌ర్లు రాహుల్ ద్ర‌విడ్, సునీల్ గ‌వాస్క‌ర్ ల స‌ర‌స‌న చేరాడు. 
 

IND vs ENG: Hitman Rohit Sharma equals Rahul Dravid, Sunil Gavaskar's records RMA
Author
First Published Mar 9, 2024, 1:13 PM IST

Rohit equals Dravid, Gavaskar's records : ధర్మశాలలో ఇంగాండ్‌తో జరిగిన 5వ చివరి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ త‌న‌దైన ఆట‌తో రాణిస్తున్నాడు. కెప్టెన్ గా, ప్లేయ‌ర్ గా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ తొలి ఇన్నింగ్స్ లో సెంచ‌రీ (103 ప‌రుగులు) బాదాడు. ఇది తన 12వ టెస్ట్ సెంచరీ కావ‌డం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తమ ఆధిపత్యాన్ని కొన‌సాగిస్తూ ఇప్ప‌టికే 3-1 ఆధిక్యంతో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది.

రోహిత్ శ‌ర్మ త‌న అంత‌ర్జాతీయ‌ క్రికెట్ కెరీర్ లో 48 సెంచ‌రీలు సాధించాడు. దీంతో దిగ్గ‌జ ప్లేయ‌ర్ రాహుల్ ద్ర‌విడ్ సెంచ‌రీల రికార్డును రోహిత్ శ‌ర్మ స‌మం చేశాడు. రోహిత్ శ‌ర్మ‌కు ఇది 12వ టెస్ట్ సెంచరీ కాగా, అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో 48వ శతకం (టెస్టులలో 12, వ‌న్డేల్లో 31, టీ20ల్లో 5 సెంచ‌రీలు). ద్ర‌విడ్ త‌న టెస్టు కెరీర్ లో 48 సెంచ‌రీలు సాధించారు. టెస్టుల్లో 36, వ‌న్డే క్రికెట్ లో 12 సెంచ‌రీలు సాధించాడు.

James Anderson: చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్.. తొలి పేసర్​గా రికార్డు !

అలాగే, ఇంగ్లాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. గవాస్కర్ ఇంగ్లాండ్‌తో 38 టెస్టుల్లో ఆడాడు. నాలుగు సెంచ‌రీలు చేశాడు. ఇంగ్లాండ్ తో  జరిగిన టెస్టుల్లో రోహిత్‌కి ధర్మశాల సెంచరీ నాలుగోది. 162 బంతుల్లో 103 పరుగుల త‌న ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు.

 

ఐపీఎల్ ను అందరూ ఇష్ట‌పడేది అందుకే.. విరాట్ కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. !

Follow Us:
Download App:
  • android
  • ios