IND vs ENG: అశ్విన్ దెబ్బ‌కు తోక‌ముడిచిన ఇంగ్లాండ్.. గెలుపు దిశ‌గా భార‌త్.. !

India vs England : ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ 5వ‌ టెస్టు మ్యాచ్ లో టీమిండియా దూకుడు కొన‌సాగుతోంది. బాల్, బ్యాట్ తో రాణించ‌డంతో గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది.  
 

IND vs ENG: England tied the tail to Ravichandran Ashwin's blow, India on the way to victory RMA

India vs England : భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జ‌రుగుతున్న చివ‌రిదైన 5వ టెస్టులో భార‌త్ గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. అద్భుత‌మైన ఆట‌తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టింది భార‌త్. బాల్, బ్యాట్ తో రాణించ‌డంతో గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్‌ 5 వికెట్ల కోల్పోయి 103 పరుగులతో ఆట‌ను కొన‌సాగిస్తోంది. 156 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. తన 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ‌రోసారి అద్భుత‌మైన బౌలింగ్ తో 4 టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అశ్విన్ బౌల్డ్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకునే స‌మ‌యానికి జోరూట్ 34 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లలో జాక్ క్రాలీ డకౌట్ కాగా, బెన్ డకెట్ 2 పరుగులు, ఓలీ పోప్ 19 పరుగులు, జానీ బెయిర్ స్టో 39 పరుగులు, బెన్ స్టోక్స్ 2 పరుగులు చేశారు. అంతకుముందు, భారత్ ఓవర్‌నైట్ స్కోరు 473/8  తో మూడో రోజు ఆట‌ను ప్రారంభించింది. అయితే, ఆట ప్రారంభమైన 20 నిమిషాల్లోనే ఆలౌట్ అయింది. మూడో రోజు 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి 477 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

ఐపీఎల్ ను అందరూ ఇష్ట‌పడేది అందుకే.. విరాట్ కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. !

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లాండ్ :  తొలి ఇన్నింగ్స్ 218/10, సెకండ్ ఇన్నింగ్స్ 22.5 ఓవర్లలో 103/5 (జానీ బెయిర్‌స్టో 39, జో రూట్ 34 నాటౌట్; రవిచంద్రన్ అశ్విన్ 4/55)

భారత్: 477/10 (శుభ్ మ‌న్ గిల్ 110, రోహిత్ శర్మ 103, దేవదత్ పడిక్కల్ 65, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 56, య‌శ‌స్వి జైస్వాల్ 57 ; షోయబ్ బషీర్ 5/173)

 

JAMES ANDERSON: చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్.. తొలి పేసర్​గా రికార్డు ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios