ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది టీమిండియా. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ, అజింకా రహానే కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రోహిత్ శర్మ 178 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 132 పరుగులు చేయగా వైస్ కెప్టెన్ అజింకా రహానే 80 బంతుల్లో5 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. 2021 ఏడాదిలో మొట్టమొదటి సెంచరీ బాదిన భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ శర్మకి ఇది నాలుగో సెంచరీ కాగా 13 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు హిట్ మ్యాన్. 23 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు బాదిన మార్నస్ లబుషేన్ మాత్రమే రోహిత్ శర్మ కంటే ముందున్నాడు.

 

దాదాపు 70 సగటుతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 800 పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అజింకా రహానే 1000+ పరుగులతో టీమిండియా తరుపున టాప్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 196 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పూజారా 21 పరుగులు చేసి అవుట్ కాగా శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు.