టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే పలు రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. పరుగుల మిషెన్ గా తనకంటూ ఓ ట్రాక్ రికార్డును ఏర్పరుచుకున్న కోహ్లీ తాజాగా... మరో రికార్డుపై కన్నేశారు. ప్రస్తుతం కోహ్లీ.... ప్రపంచ రికార్డ్ కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. తన ఖాతాలో కనుక ఒక్క సెంచరీ పడితే... ప్రపంచ రికార్డ్ తన సొంతమౌతుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... మూడు వన్డే సీరిస్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ముంబయి వేదికగా భారత్-ఆసీస్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read కంగారూలతో తొలి వన్డే.... విరాట్ లెక్క సరిచేసేనా?...

గతేడాది బలహీన జట్టుతో భారత్‌లో అడుగుపెట్టి టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న ఆసీస్‌ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే... ఈ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురు చూస్తున్నారు.

ఆసీస్ మాజీ కెప్టెన్ రీకీ పాంటింగ్... కెప్టెన్ గా 41 సెంచరీలు చేసి తన పేరిట రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డుపై కోహ్లీ కన్ను పడింది. కేవలం ఒక్క సెంచరీ చేస్తే... ఆ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే.... కేవలం 196 ఇన్నింగ్స్ లో రికార్డు సృష్టించిన వాడు అవుతాడు. ఇదే రికార్డును రీకీ పాంటింగ్ 376 ఇన్నింగ్స్ లో పూర్తి చేయగా... కోహ్లీ కేవలం 196 ఇన్నింగ్స్ లోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది.