రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ను వేగవంతం చేశాడు. ఈ సమయంలో ఓ షాట్ అంపైర్ వైపు బుల్లెట్ షా దూసుకెళ్లింది.

Champions trophy లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ఫుల్ షాట్ కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీకి బంటి బుల్లెట్ లా తగిలేంత పని అయింది. ఈ ఘటన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ లో జరిగింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 8 పరుగులు చేసి 30/1 వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, అతను కొట్టిన ఓ షాట్ అంపైర్ క్రిస్ గఫానీకి తగిలేంత పని చేసింది.

భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఈ సంఘటన జరిగింది. రోహిత్ శర్మ క్రీజు వెలుపలికి వచ్చి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో బంతిని నేరుగా ఫోర్ కొట్టాడు. ఆ షాట్ ఎంత పవర్ఫుల్‌గా ఉందంటే క్రిస్ గఫానీకి తగిలే ప్రమాదం ఉంది. అయితే, న్యూజిలాండ్ అంపైర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే కిందకు పడుకోవడంతో బంతి తగలకుండా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

చూడండి: రోహిత్ శర్మ షాట్‌కు అంపైర్ తృటిలో తప్పించుకున్నాడు

Scroll to load tweet…

రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపించాడు. విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో కూపర్ కానల్లీ బౌలింగ్‌లో 28 పరుగులు చేసి 43/2 వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీతో శ్రేయాస్ అయ్యర్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను నిరాశపరిచారు. 20వ ఓవర్లో ఇండియా స్కోరు 100 దాటింది.

విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. భాగస్వామ్యం మరింత బలపడుతున్న సమయంలో ఆడమ్ జంపా శ్రేయాస్ అయ్యర్‌ను 45 పరుగుల వద్ద అవుట్ చేసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కోహ్లీతో అక్షర్ పటేల్ జత కలిశాడు.

విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 30 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 49 ఓవర్లకు టార్గెట్ ను చేజ్ చేసి.విజయతీరాలకు చేరింది.