మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్... మరోసారి సత్తాచాటుతున్నారు. అనుభవం లేని భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, మొదటి రోజు లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ 1 పరుగు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 5 పరుగులు చేసిన హార్రీస్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 17 పరుగులకే ఓపెనర్లద్దరినీ కోల్పోయిన ఆసీస్‌ను లబుషేన్, స్మిత్ కలిసి మరోసారి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి అజేయంగా 48 పరుగులు జోడించారు.