భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొట్టమొదటి డే నైట్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌ కేవలం 36 పరుగులకే పరిమితం కావడంతో ఐదురోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్ కాస్తా మూడు రోజుల్లోనే ముగిసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి దక్కిన ఆధిక్యంతో కలిపి 90 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా... ఎక్కడా తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. మాథ్యూ వేడ్, జో బర్న్స్ కలిసి మొదటి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

53 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ రనౌట్ రూపంలో వెనుదిరరగా లబుషేన్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జో బర్న్స్ 63 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఆసీస్‌కి విజయాన్ని అందించాడు.