Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS: జోరుమీదున్న ఓపెనర్లు... భారీ స్కోరు దిశగా ఆసీస్, వికెట్లు తీయలేకపోయిన భారత బౌలర్లు...

వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆరోన్ ఫించ్...

డేవిడ్ వార్నర్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఫించ్...

మొదటి 15 ఓవర్లలో ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు...

IND vs AUS 1st ODI: Australia Openers batting well, Indian bowlers failed to pick wickets CRA
Author
India, First Published Nov 27, 2020, 10:36 AM IST

INDvsAUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. 15 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది బుమ్రా, షమీ, సైనీలతో కూడిన భారత బౌలింగ్ విభాగం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్లు కోల్పోకుండా  74 పరుగులు చేసింది... 

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 34 పరుగులు చేయగా, ఆరోన్ ఫించ్ 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. షమీ, బుమ్రా, సైనీ వంటి భారత టాప్ బౌలర్లు నాలుగేసి ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయారు. పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తుండడం, భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది ఆస్ట్రేలియా.

ఈ దశలో ఆరోన్ ఫించ్ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు ఫించ్. వార్నర్ 115 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఫించ్ 126 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల మైలురాయి అందుకున్నాడు. గత ఏడు వన్డే మ్యాచుల్లో పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోయాడు బుమ్రా. 2020లో ఆడిన ఏడు వన్డేల్లో బుమ్రాకి ఒకే వికెట్ దక్కింది.  

Follow Us:
Download App:
  • android
  • ios