మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి వచ్చి ఆటగాళ్లను వెంబడించిన ఎద్దు.. వీడియో వైరల్
IPL 2024: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక ఎద్దు గ్రౌండ్ లోకి ప్రవేశించి ఆటగాళ్లను తరిమింది. దీంతో దాని నుంచి తప్పించుకోవడానికి ఆటగాళ్లు గ్రౌండ్ లో పరుగులు తీయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
cricket viral video : క్రికెట్ మ్యాచ్‌ల మధ్య జరిగే అనేక ఆసక్తికరమైన సంఘటనలు చాలాసార్లు వైరల్‌గా మారాయి. ఇప్పుడు కూడా మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఒక వీడియో వైరల్ గా మారింది. ఒక ఎద్దు మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ లోకి ప్రవేశించింది. ఎద్దు పిచ్‌పైకి దూసుకెళ్లి ఆటగాళ్లను తరిమికొట్టింది. బ్యాట్స్‌మన్ ను వెంబడించిన తర్వాత, బౌలర్‌ను వెంబడించింది. దీంతో ఆ ఎద్దు నుంచి తప్పించుకోవడానికి బౌలర్ పరుగులు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఐపీఎల్ 2024 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా..?
ఒక చిన్న గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. అది మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్. స్టేడియం స్థాయి ఫీల్డ్ కాదు. ఎత్తైన ప్రాంతాలలో చదునైన వరి పొలం. ఈ మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది వచ్చారు. మ్యాచ్‌ను తిలకించేందుకు పట్టణ ప్రజలు, క్రికెట్ ప్రియులతోపాటు పలువురు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఓవర్ ముగిసిన తర్వాత మరో బౌలర్ వచ్చాడు. అతను బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్ క్రిస్‌లో ఉన్నాడు. ఫీల్డర్లు కూడా సెట్ అయ్యారు. ఈ సమయంలో క్రికెట్ మ్యాచ్ మధ్యలో రెండు ఎద్దులు మైదానంలోకి ప్రవేశించాయి. ఒక ఎద్దు మరింత దూకుడుగా ప్రవర్తించకుండా అది పిచ్ దగ్గరికి రాకుండా మైదానంలో ఒకవైపు కదిలింది కానీ, ఇంకో ఎద్దు మాత్రం అక్కడి ప్లేయర్లను తరమింది.
WPL 2024 లో బాలీవుడ్ జోష్.. ! గ్రాండ్ గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేడుక.. !
బ్యాట్స్‌మెన్ బ్యాట్ ఊపుతూ ఎద్దును బెదిరించే ప్రయత్నం చేశాడు. తర్వాత ఎలాగోలా ఎద్దు కంట పడకుండా తప్పించుకున్నాడు. అయితే ఎద్దు దూకుడుకు బ్యాట్స్‌మెన్, ఫీల్డర్లు పరుగులు తీశారు. బౌలర్ కూడా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే బౌలర్‌ను టార్గెట్ చేసిన ఎద్దు అతనిపైకి దూసుకెళ్లింది. దీంతో అతను దాని నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోకు భారీ కామెంట్లు వచ్చాయి.
అప్పుడు సచిన్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ.. డీప్‌ఫేక్ వలలో టీమిండియా !