INDvsAUS 2nd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ మనదే..
India vs Australia 2nd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. మార్పులతో ఆస్ట్రేలియా, బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన భారత జట్టు..
ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. మొదటి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంటుంది భారత జట్టు..
తొలి వన్డే విజయంతో ఐసీసీ నెం.1 వన్డే టీమ్‌గా నిలిచిన టీమిండియా, ఆ ర్యాంకును నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ఆస్ట్రేలియా గెలిస్తే, మళ్లీ నెం.1 టీమ్‌గా నిలుస్తుంది.
నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకి కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్యాట్ కమ్మిన్స్‌కి, మిచెల్ మార్ష్‌కి ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా..
జోష్ హజల్‌వుడ్‌తో పాటు స్పెన్సర్ జాన్సర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత జట్టు, సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి నేటి మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు తుది జట్టులో చోటు దక్కింది.
కొన్నాళ్ల క్రితం తండ్రి అయిన జస్ప్రిత్ బుమ్రాకి వన్డే వరల్డ్ కప్‌కి ముందు రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్. దీంతో బుమ్రా, మొహాలీ నుంచి నేరుగా ముంబైలోని తన స్వగృహానికి చేరుకున్నాడు. జస్ప్రిత్ బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్‌కి ఆసీస్ టూర్ టీమ్‌లో చోటు దక్కింది. బుమ్రా చివరి వన్డేలోనూ ఆడడం అనుమానమే..
గత మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. రీఎంట్రీ తర్వాత అతని బ్యాటు నుంచి మంచి పర్ఫామెన్స్ వస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమ్‌లోని ప్లేయర్లు అందరూ ఫామ్‌లోకి వచ్చినట్టు అవుతుంది.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, సీన్ అబ్బాట్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్
భారత జట్టు: శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ