Asianet News TeluguAsianet News Telugu

అనవసరపు చర్చ... ధోనీ పునరాగమనంపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

చాలా కాలం క్రికెట్ కి దూరంగా ఉండి... మళ్లీ జట్టులోకి రావడం అనేది చాలా కష్టమైన విషయమని కపిల్ దేవ్ పేర్కొన్నారు.  కానీ, ధోనీకి ఐపీఎల్ ఉందని చెప్పారు. అది ధోనీకి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. అయితే టీమిండియా సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలని అన్నారు. 

If you haven't played for so long, don't think you can come back from anywhere: Kapil Dev on MS Dhoni
Author
Hyderabad, First Published Feb 3, 2020, 2:47 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జట్టులోకి పునరాగమం ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ధోనీని కావాలనే పక్కన పెడుతున్నారంటూ మండిపడుతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా... తాజాగా ధోనీ పునరాగమంపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు.

చాలా కాలం క్రికెట్ కి దూరంగా ఉండి... మళ్లీ జట్టులోకి రావడం అనేది చాలా కష్టమైన విషయమని కపిల్ దేవ్ పేర్కొన్నారు.  కానీ, ధోనీకి ఐపీఎల్ ఉందని చెప్పారు. అది ధోనీకి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. అయితే టీమిండియా సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలని అన్నారు. ధోనీ దేశానికి ఎన్నో సాధించారని గుర్తు చేశారు. కానీ 6 -7 నెలలు క్రికెట్ కి దూరమై అందరిలో ధోనీనే తన భవిష్యత్తుపై సందేహాలు కలిగించాడని చెప్పారు. దీని వల్ల అనవసర చర్చలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. 

Also Read క్లీన్ స్వీప్... సంజు శాంసన్ సూపర్ స్టంట్ చూశారా?...

కాగా ఐపీఎల్ బాగా ఆడితే టీ20 ప్రపంచకప్ లో ధోనీని తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ తిరిగి మళ్లీ జట్టుతో కలిసింది లేదు. దీంతో అభిమానులు ఆయన మళ్లీ ఎప్పుడు బ్యాట్ పట్టుకుంటాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios