తన భార్య అనుష్క కారణంగా తాను చాలా మారిపోయానంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. అనుష్క శర్మ తన జీవితంలోకి ప్రవేశిం చిన తర్వాత తన ఆలోచనా ధోరణిలో ఎంతో మార్పువచ్చిందని విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమకంటూ సమయం కేటాయించుకుంటూనే ఉంటారు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ దంపతులకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే అవకాశం దక్కింది. కాగా.. తాజాగా విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.

అనుష్క తనను పూర్తిగా మార్చిందని, ఆమె జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టమంటూ పేర్కొన్నాడు. నిరంతరం మంచి కోసం తపనపడుతుందని, తన క్రికెట్​ కెరీర్​తో పాటు జీవితానికి ఎంతో మేలు చేసిందంటూ వెల్లడించాడు. భారత టెస్టు క్రికెట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తాజాగా.. కోహ్లీని ఇంటర్వ్యూ చేయగా.. ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. అయితే.. అనుష్క గురించి విరాట్ కోహ్లీ పంచుకున్న విషయాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

అన్ని విషయాల్లో విభిన్న కోణాన్ని కూడా చూసేలా నేను మారానంటే అందుకు పూర్తి క్రెడిట్  అనుష్కకే దక్కుతుందన్నాడు. తాము ఒకరి నుంచి ఒకరం నిరంతరం చాలా నేర్చుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అనుష్క జీవితంలోకి రాకముందు తాను ఎక్కువగా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదని, ప్రాక్టీకల్​గా ఆలోచించేవాడిని కాదంటూ చెప్పాడు. ఆమె వల్లె తన మైండ్​సెట్ మారిందని, ఇప్పుడు చాలా విషయాలను అర్థం చేసుకుంటున్నానని, దీనికి ఫుల్ క్రెడిట్ ఆమెదేనంటూ కోహ్లీ ప్రశంసించాడు.  

 ‘నేనిప్పుడు ప్రతి అంశాన్ని విభిన్న కోణంలో చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్క. ఆమె రాకముందు నేనెక్కువగా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదు. వాస్తవంగా ఆలోచించే వాడిని కాదు. ఇలా.. చాలా విషయాల్లో నా దృక్కోణాన్ని ఆమె మార్చివేసింది. అనేక అంశాలను విశాల దృక్పథంలో చూడాలని నాకు అర్థమయ్యేలా చేసింది. ఆమెను కలుసుకోకుండా ఉండుంటే, నాలో ఈ మార్పులన్నీ ఉండేవి కాదు’ అని భార్యను కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.