కరోనా కేసుల నేపథ్యంలో లార్డ్స్ నుంచి ఫైనల్ తరలించినట్టు ప్రకటన...లార్డ్స్‌కి బదులుగా సౌంతమ్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానంలో ఫైనల్ మ్యాచ్...ఫైనల్‌కి రిజర్వు డేగా జూన్ 23... వర్షం వచ్చినా, మరే కారణంతో అయినా...

అనుకున్నట్టుగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మారింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌కి బదులుగా సౌంతమ్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానంలో జూన్ 18 నుంచి 22 వరకూ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

వర్షం, మరేదైనా కారణాల వల్ల ఆటకు అంతరాయం కలిగితే రిజర్వు డేగా జూన్ 23ను నిర్ణయించారు. ‘లండన్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో లార్డ్స్‌కి బదులుగా, సౌంతమ్టన్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుంది... ’ అంటూ ప్రకటించాడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.

72.2 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయంట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన టీమిండియా, 70 శాతం విజయాలతో ఉన్న న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.