పదేళ్ల తర్వాత వన్డే వికెట్ తీసిన విరాట్... భార్య అనుష్కతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ..

9 ఏళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ తీసిన విరాట్ కోహ్లీ... 500+ పరుగులు చేసి, వరల్డ్ కప్‌లో వికెట్ తీసిన క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. 

ICC World cup 2023: Virat Kohli picks ODI wicket after 9 long years, creates rare record CRA

విరాట్ కోహ్లీ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని మోస్ట్ మెమొరబుల్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బ్యాటింగ్‌లో రెండు సెంచరీలు, 7 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. 600 మార్కుకు దగ్గరగా వచ్చేశాడు..

సెమీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ 80+ పరుగులు చేస్తే, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు కూడా బద్ధలైపోతుంది. తాజాగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు. 

ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ, తన మొదటి ఓవర్‌లో 7 పరుగులు ఇచ్చాడు. తన రెండో ఓవర్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ని అవుట్ చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

 

చివరిగా 2014లో వన్డే వికెట్ తీసిన విరాట్ కోహ్లీ, 9 ఏళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ సాధించాడు. వికెట్ సాధించిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్క శర్మవైపు చేతులు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ వికెట్ తీయగానే పట్టలేని ఆనందంతో ఎగిరి సెలబ్రేట్ చేసుకుంది అనుష్క శర్మ..

వైట్ బాల్ క్రికెట్‌ (వన్డే+ టీ20) వరల్డ్ కప్‌ టోర్నీలో 50+ పరుగులు చేసి, వికెట్ తీయడం విరాట్ కోహ్లీకి ఇది మూడోసారి. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్నవారిలో బెన్ స్టోక్స్‌ మాత్రమే ఈ ఫీట్ 3 సార్లు సాధించాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 500+ పరుగులు చేసి, వికెట్ తీసిన ఏకైక ప్లేయర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios