Virat Kohli : హాఫ్ సెంచరీ సెంచరీల రికార్డ్... ఇదే ఓ చిత్రమైతే..: విరాట్ కోహ్లీ భావోద్వేగం
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను అధిగమించి హాఫ్ సెంచరీ సెంచరీలు సాధించడంపై విరాట్ కోహ్లీ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసారు.
ముంబై : అతడిని అభిమానులు ముద్దుగా రన్ మెషీన్ అని పిలుచుకుంటారు. కానీ అతడి పరుగుల సునామీ చూస్తుంటే నిజంగానే అతడో పరుగుల యంత్రమేమో అనిపించక మానదు. అది వన్డే,టీ20, టెస్ట్ మ్యాచా అన్నది చూడడు...స్వదేశంలో ఆడుతున్నామా లేక విదేశాల్లో ఆడుతున్నామా అన్నది పట్టించుకోడు... ఫార్మాట్ ఏదైనా... పిచ్ ఎలా వున్నా పరుగులు సాధించడం ఒక్కటే అతడి పని. ఇలా అతడి పరుగుల దాహానికి ఎన్నో రికార్డులు బద్దలవగా తాజాగా అత్యధిక సెంచరీల రికార్డును కూడా బద్దలుగొట్టాడు. ఇది పొగడడం కాదు... కింగ్ కోహ్లీ గురించి నిజాలు చెప్పడం మాత్రమే. నిజంగానే అతడిని పొగడాలంటే మాటలు చాలవు... బ్యాటింగ్ గురించి చెప్పాలంటే అద్భుతం, అత్యద్భుతం అనే పదాలు కూడా సరిపోవు.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇలా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు మాత్రమే సాధ్యమైన 49 సెంచరీల రికార్డు కూడా కోహ్లీ పరుగుల దాహం ముందు చిన్నబోయింది. ఇదే వరల్డ్ కప్ లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమంచేసిన కోహ్లీ తాజాగా దాన్ని అధిగమించాడు. వాంఖడే స్టేడియంలో సచిన్ కళ్లముందే అతడి రికార్డును బద్దలుకొట్టి హాఫ్ సెంచరీ సెంచరీల ఘనతను సాధించాడు కింగ్ కోహ్లీ.
Read More Mohammed Shami : షమీ వికెట్ల సునామీ... ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని రికార్డులేంటి భయ్యా...
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో... బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్ పై... క్రికెట్ గాడ్ సచిన్ కళ్లముందే సాధించిన 50వ సెంచరీ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. దీంతో సెంచరీ పూర్తయిన వెంటనే పెవిలియన్ లోని సచిన్ వైపు చూస్తూ ఇది మీకే అంకితం అనేలా సంబరాలు చేసుకున్నాడు కోహ్లీ. అంతేకాదు తన భార్య అనుష్కకు మైదానంలోంచే ముద్దుల వర్షం కురిపించాడు. ఇలా మైదానంలోనే ఒకింత భావోద్వేగానికి లోనయిన కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆ అపురూప క్షణంలో తన ఫీలింగ్ ను ఎలా వున్నాయో బయటపెట్టాడు.
ఈ సెంచరీ నాకెంతో ప్రత్యేకమైనది... ఈ అపురూప క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని కోహ్లీ అన్నారు. ఈ ఆనందంలో తన భావాలు ఎలా వున్నాయో మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నాడు. ఇదంతా ఓ కలలా వుంది... నేను సాధించిన ఈ ఘనత నిజమేనా అనిపిస్తోందన్నాడు. నా హీరో సచిన్... జీవిత భాగస్వామి అనుష్క ఈ ఫీట్ సాధించడం తన సంతోషాన్ని రెట్టింపు చేసిందన్నారు. అభిమానులంతా తనకు తోడుగా నిలిచారు కాబట్టే ఇది సాధ్యమయ్యందన్నాడు. ఈ క్షణంలో తన భావాలను వ్యక్తపర్చలేకున్నా... ఒకవేళ తనకు ఓ చిత్రాన్ని గీసే అవకాశం వుంటే ఖచ్చితంగా ఇదే గీస్తానని విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యారు.