Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: టాస్ గెలిచిన టీమిండియా... క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి లీగ్ మ్యాచ్...

India vs Netherlands: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ మార్పులు లేకుండా బరిలో దిగిన భారత జట్టు.. 

ICC World cup 2023: Team India won the toss and elected to bat, India vs Netherlands CRA
Author
First Published Nov 12, 2023, 1:51 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు భారత జట్టు, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి 8 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, 9వ విజయంతో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది..

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది. అయితే సెమీస్‌కి ముందు గ్యాప్ రావడంతో పూర్తి జట్టుతో బరిలో దిగుతోంది టీమిండియా. మొదటి 8 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి సంచలనం క్రియేట్ చేసింది..

నేటి మ్యాచ్ గెలిస్తే నెదర్లాండ్స్ టాప్ 7లో ముగించి, నేరుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. 


భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ జట్టు: వెస్లీ బర్రెసీ, మ్యాక్స్‌ ఓడాడ్, కోలిన్ అకీర్‌మన్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్జ్, స్కాట్ ఎడ్వర్డ్స్, బస్ దే లీడే, తేజ నిడమనురు, లోగన్ వాన్ బ్రీక్, రోలఫ్ వాన్ దే మీర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మికీరన్ 

Follow Us:
Download App:
  • android
  • ios