Asianet News TeluguAsianet News Telugu

ICC WORLD CUP 2023 : ఫైనల్లో ఇండియా ఓడిపోయింది.. అయితే ఏంటి

దశాబ్దాలుగా క్రికెట్ మనకు భావోద్వేగంతో కూడిన క్రీడ. అందుకే ప్రతి సారీ.. ప్రతి మ్యాచ్ లోనూ భారత్‌ గెలవాలని కోరుకుంటాం. పూజలు చేస్తాం. కానీ వాస్తవానికి జరిగేది ఆరోజు బాగా ఆడిన జట్టు గెలుస్తుంది.

ICC WORLD CUP 2023 : Team India won billion hearts with high quality cricket
Author
First Published Nov 20, 2023, 5:53 PM IST

ఒకటీ.. రెండు.. మూడు కాదు.. వరుసగా పది మ్యాచుల్లో గెలిచాం. ప్రపంచ కప్ చరిత్రలో సీరీస్ హయ్యస్ట్ ఇండివిడువల్ స్కోర్ మనవాళ్లదే. ఈ ప్రపంచ కప్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మనవాళ్లవే. టెస్ట్.. వన్డే.. టీ20 ఈ మూడు ఫార్మెట్లలోనూ మనవాళ్లే నంబర్ వన్.

బెస్ట్ టెస్ట్ బౌలర్..ఆల్ రౌండర్ మనవాళ్లే. బెస్ట్ వన్డే బ్యాటర్ మనవాడే. బెస్ట్ T20 బ్యాటర్ మనవాడే.

రెండు సార్లు టెస్ట్ ప్రపంచ చాంపియన్ షిప్ లో మనం ఫైనల్ కి వెళ్లాం. వన్డే.. టీ 20.. ఐపీఎల్లోనూ మన క్రికెటర్ల ఆటలో క్వాలిటీ పెరిగింది. ఒకరికి గాయమైతే ఆ ప్లేస్ ని భర్తీ చేసేందుకు కనీసం ఇద్దరు ముగ్గురు బెంచ్ లో ఉన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ జట్టు.. అత్యుత్తమ క్వాటిటీ క్రికెట్ మనదే అని చెప్పడానికి ఇంకేం కావాలి.

ICC WORLD CUP 2023 : Team India won billion hearts with high quality cricket

 

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోవడాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. క్రీడా స్ఫూర్తితో చూస్తే.. ఈ ఓటమి అత్యంత సాధారణ విషయం.

ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన ఆస్ట్రేలియా అంత గొప్ప టీమూ కాదు.. కేవలం ఫైనల్ ఓడినంత మాత్రాన భారత చెత్త టీమూ కాదు. దీర్ఘకాలం పాటు క్వాలిటీ క్రికెట్ ఎవరు ఆడుతున్నారు.. ఆ జట్ల క్రీడా ప్రమాణాలు ఎలా మెరుగవుతున్నాయో చూస్తే.. ఈ ప్రపంచ కప్ అత్యద్భుతం.  ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఆటతీరు మినహాయిస్తే.. ప్రతి టీం కూడా క్వాలిటీ క్రికెట్ ఆడినట్లే.

ICC WORLD CUP 2023 : Team India won billion hearts with high quality cricket

మొన్నటిదాకా పసికూనలని భావిస్తున్న అఫ్గానిస్తాన్, నెదర్లాండ్ జట్లయితే నా దృష్టిలో దాదాపు ప్రపంచ కప్ కొట్టినట్లే. వాళ్లు కనబరచిన ఆటతీరు అలాంటిది మరి. ఈ ప్రపంచకప్‌లో 401 పరుగులను (D/L) చేధించే స్థాయిలో బ్యాటింగ్ చేసి గెలిచన పాకిస్తాన్ నీ చూశాం.. అలాగే 50 పరుగులకే కుప్ప కూల్చిన భారత్ బౌలింగ్‌నూ చూశాం.

ఇంతకన్నా క్వాలిటీ క్రికెట్ ఏం కావాలి.

మనం కప్పు మాత్రం గెలవలేదు. అంతే.. మిగతా అన్నీ గెలిచనట్లే. శుభ్‌మన్ గిల్ మొదలుకొని సూర్యకుమార్ యాదవ్ వరకూ తన దైన రోజు.. తన అవసరం వచ్చిన మ్యాచ్‌లో తమను తాము నిరూపించుకున్నారు.  మన ఫ్యాభ్ 5 (షమీ, బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్) బౌలింగ్ అయితే.. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బౌలింగ్ తమదేనని దాదాపు 10 సార్లు నిరూపించింది.

ప్రపంచ కప్ గెలిచి ఉంటే బాగుండేది. కాకుంటే ఫైనల్ మ్యాచ్ రోజు మనకు కలిసి రాలేదంతే.

ICC WORLD CUP 2023 : Team India won billion hearts with high quality cricket

భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. మొదటి నుంచీ చెప్పే మాట ఒకటే. మేం భవిష్యత్తు గురించి పట్టించుకోం. మనకు వర్తమానం ముఖ్యం. ఈ రోజు ఈ మ్యాచ్ ఎలా ఆడాం.. ఎలా నెగ్గాం అనేదే చూస్తాం.. అనేది రోహిత్ నమ్మే ఫార్ములా. ఈ ఫార్ములా 10 సార్లు విజయవంతమైంది.  ఫైనల్ కీ అలాగే వెళ్లారు. కానీ..  పిచ్ కండిషన్, ఫైనల్ ఒత్తిడి, అతి జాగ్రత్త, ఆస్ట్రేలియా అత్యుత్తమ ఫీల్డింగ్ అన్నీ కలగలిసి భారత ఓటమికి దారి తీశాయి. ఈ ఒక్క రోజు మనది కాదంతే. ఇలా చెప్పుకొంటూ పోతే.. 2023 క్రికెట్ ప్రపంచ కప్ భారత్‌కి, భారత అభిమానులకు చాలా వినోదాన్ని, క్వాలిటీ క్రికెట్‌ను అందించింది.

మరోమాట.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినపుడు ప్రదాని మోదీ నుంచి సగటు క్రికెట్ అభిమాని వరకూ జట్టుకు మద్దతుగా నిలిచిన తీరు మన దేశంలో క్రికెట్ అభిమానుల్లో పెరిగిన క్రీడా పరిణితికి ఓ మంచి ఉదాహరణ.

ICC WORLD CUP 2023 : Team India won billion hearts with high quality cricket

దశాబ్దాలుగా క్రికెట్ మనకు భావోద్వేగంతో కూడిన క్రీడ. అందుకే ప్రతి సారీ.. ప్రతి మ్యాచ్ లోనూ భారత్‌ గెలవాలని కోరుకుంటాం. పూజలు చేస్తాం. కానీ వాస్తవానికి జరిగేది ఆరోజు బాగా ఆడిన జట్టు గెలుస్తుంది. మళ్లీ మొదటికి వస్తున్నా.. మనం ఈ ప్రపంచ కప్ లో పది సార్లు గెలిచాం. ఒక సారి ఓడిపోయాం. అంతే.. స్టిల్ వి యార్ నం.1

Follow Us:
Download App:
  • android
  • ios