Asianet News TeluguAsianet News Telugu

ICC World CUP 2023 : టీమిండియాకు అద్భుత అవకాశం... కివీస్ పై రివేంజ్ తీర్చుకునేందుకు రెడీనా..!

గత ప్రపంచకప్ లో ఎదురైన పరాభవానికి స్వదేశంలోనే రివేంజ్ తీర్చుకునే అద్భుత అవకాశం టీమిండియాకు వచ్చింది.  

ICC World CUP 2023 ... Team india ready to take a revenge to New  Zealand AKP
Author
First Published Nov 14, 2023, 11:52 AM IST

హైదరాబాద్ : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరగకుండా దూసుకుపోతున్న రోహిత్ సేన ప్రపంచ విజేతగా నిలిచేందుకు కేవలం రెండడుగుల దూరంలో నిలిచింది. భారత ఆటగాళ్ల ఫామ్, ఇప్పటివరకు టీమిండియా ప్రదర్శన చూస్తుంటే ప్రపంచ కప్ ట్రోపీని దేశం దాటనిచ్చేదే లేదన్నట్లుగా వుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగా వుంది. ఇప్పుడున్న భారత జట్టుకు తిరుగులేదు... కానీ ఇకపై జరిగే రెండుమ్యాచులు అత్యంత కీలకం కాబట్టి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. గత ప్రపంచకప్ అనుభవం టీమిండియా ఫ్యాన్స్ మరింత టెన్షన్ పెడుతోంది. 

2019 ప్రపంచ కప్ లోనూ ఇప్పటిలాగే టీమిండియా అద్భుత ఆటతీరుతో వరుస విజయాలు అందుకుంది. ఇప్పటిలాగే సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ మధ్యనే జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టును న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో ఓడించింది.ఇలా గత ప్రపంచకప్ సెమీస్ ను గుర్తుచేసుకుని మళ్ళీ అలా జరుగకూడదని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

గత ప్రపంచ కప్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమిండియాకు వచ్చింది.  2019 వరల్డ్ కప్ లో మనల్ని ఎలాగయితే ఉట్టిచేతులతో ఇంటికి పంపించారో ఇప్పుడు న్యూజలాండ్ ను కూడా అలాగే ఇంటికి పంపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచ కప్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఇదే జరుగుతుందన్న గట్టి నమ్మకంతో అభిమానులు వున్నారు.  

Read More  సెమీస్ ముందు టీమిండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కివీస్ మాజీ కెప్టెన్ .. ఇంతకీ ఏమన్నారంటే..?

అయితే న్యూజిలాండ్ ను అంత తక్కువగా అంచనా వేయకూడదు... తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునయినా ఓడించే సత్తావున్న జట్టది. ప్రపంచ కప్ చరిత్రను పరిశీలించినా భారత్ పై కివీస్ కే స్వల్ప ఆధిక్యత వుంది. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ టోర్నీల్లో ఇండియా-కివీస్ మధ్య 9 మ్యచులు జరిగాయి. ఇందెలో టీమిండియ 4, న్యూజిలాండ్  5 మ్యాచుల్లో విజయం సాధించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios