Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: ఆఫ్ఘాన్‌పై సౌతాఫ్రికా ఘన విజయం... ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి! సెమీస్ చేరకపోయినా ..

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడిన ఆఫ్గాన్... సౌతాఫ్రికా -  ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీ ఫైనల్.. 

ICC World cup 2023: South Africa beats Afghanistan, Afghan finishes with 4 wins CRA
Author
First Published Nov 10, 2023, 10:06 PM IST | Last Updated Nov 10, 2023, 10:06 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘాన్ కథ ముగిసింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఆఫ్గాన్. గత ప్రపంచ కప్‌లో 9కి 9 మ్యాచులు ఓడిన ఆఫ్ఘాన్, ఈసారి 4 విజయాలతో అదరగొట్టింది... 

చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో ఓడినా 5 వికెట్లు తీసి, సఫారీ జట్టుని భయపెట్టింది.  క్వింటన్ డి కాక్ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేయగా కెప్టెన్ తెంబ భవుమా 28 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేశాడు..

అడియిన్ మార్క్‌రమ్ 25, హెన్రీచ్ క్లాసిన్ 10, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 182 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. అయితే రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 95 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేయగా ఆండిలే ఫెహ్లుక్వాయో 37 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది..రెహ్మనుల్లా గుర్భాజ్  25 పరుగులు చేయగా ఇబ్రహీం జాద్రాన్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేశాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 2 పరుగులు చేసి నిరాశపరచగా రెహ్మత్ షా 46 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు..

ఇక్రమ్ అలికిల్ 12, మహ్మద్ నబీ 2 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 14, నూర్ అహ్మద్ 26 పరుగులు చేశాడు. ముజీబ్ 8, నవీన్ ఉల్ హక్ 2 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు..

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌కి సెంచరీ పూర్తి చేయడానికి 4 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి సింగిల్ తీసిన నవీన్ ఉల్ హక్, ఓమర్‌జాయ్‌కి స్ట్రైయిక్ ఇచ్చాడు. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి కూడా సింగిల్ తీసి మళ్లీ ఓమర్‌జాయ్‌కి స్ట్రైయిక్ ఇచ్చాడు నవీన్..

ఆఖరి 3 బంతుల్లో అజ్మతుల్లాకి 3 పరుగులు కావాల్సి రాగా రెండు డాట్ బాల్స్‌ రావడంతో చివరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు ఓమర్‌జాయ్‌. ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా నవీన్ ఉల్ హక్ రనౌట్ అయ్యాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios