ICC World cup 2023: నెదర్లాండ్స్‌ని మరోసారి ఆదుకున్న మిడిల్ ఆర్డర్... బంగ్లాదేశ్ ముందు..
Netherlands vs Bangladesh: 68 పరుగులు చేసిన స్కాట్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్... బంగ్లాదేశ్ ముందు 230 పరుగుల టార్గెట్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా కోల్‌కత్తాలో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌తో తలబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్, నిర్ణీత 50 ఓవర్లలో 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఎప్పటిలాగే టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించి, నెదర్లాండ్స్‌కి మంచి స్కోరు అందించారు..
విక్రమ్ జీత్ సింగ్ 3 పరుగులు చేయగా మ్యాక్స్ ఓడాడ్ డకౌట్ అయ్యాడు. కోలీన్ అకీర్‌మాన్ 15 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 41 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసిన వెస్లీ బర్రెసీ, ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. బస్ దే లీడే 32 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేయగా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కలిసి ఆరో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 89 బంతుల్లో 6 ఫోర్లతో 68 పరుగులు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..
61 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్‌ని, మెహిదీ హసన్ మిరాజ్ అవుట్ చేశాడు. షరీజ్ అహ్మద్ 6 పరుగులు చేసి రనౌట్ కాగా ఆర్యన్ దత్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 4, 4, 2, 6, 1 బాదిన లోగన్ వాన్ బీక్ 19 పరుగులు రాబట్టాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన లోగన్ వాన్ బీక్ నాటౌట్‌గా నిలవగా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వాన్ మీకరన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.