Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: చెన్నైలో జడ్డూ మ్యాజిక్.. 5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...

30 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. 

ICC World cup 2023: Ravindra Jadeja picks 3, Australia lost 5 wickets, India vs Australia CRA
Author
First Published Oct 8, 2023, 4:38 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో భారత బౌలర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ భలేగా వర్కవుట్ అవుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 30 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది.

6 బంతులు ఆడిన మిచెల్ మార్ష్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్‌‌ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ని డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు మిచెల్ మార్ష్..

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, ఏబీ డివిల్లియర్స్ రికార్డులు బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్.. 

52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

క్లియర్‌గా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకుని ఓ రివ్యూని వృథా చేశాడు లబుషేన్. అదే ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండు బంతులాడిన అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. 21.4 నుంచి 31.5 ఓవర్ల మధ్య 12.1 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం.. 

Follow Us:
Download App:
  • android
  • ios