నాలుగు నెలలుగా జీతాల్లేవ్! వన్డే వరల్డ్ కప్‌లో ఆ లోగో లేకుండా పాకిస్తాన్ క్రికెట్ టీమ్...
పాక్ ప్లేయర్లకు నాలుగు నెలలుగా మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కష్ట కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 స్టేజీ నుంచే నిష్కమించింది పాకిస్తాన్. భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడి ఓడింది..
హారీస్ రౌఫ్, నసీం షా, ఆఘా సల్మాన్ గాయాలతో లంకతో మ్యాచ్‌కి దూరమయ్యారు. నసీం షా గాయంతో వన్డే వరల్డ్ కప్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆసియా కప్ ఓటమి తర్వాత పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవైనట్టు కూడా వార్తలు వచ్చాయి..
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం పాక్ పురుషుల క్రికెట్ టీమ్‌కి నాలుగు నెలలుగా జీతాలు లేవట. ఆసియా కప్ 2023 టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించిన పీసీబీ, పాక్ ప్లేయర్లకు నాలుగు నెలలుగా మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
ఈ కారణంగానే పాక్ క్రికెట్ టీమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో స్పాన్నర్ల లోగోలు కనిపించకుండా స్టిక్కర్లు పెట్టుకుని ఆడి, నిరసన తెలపాలని అనుకుంటోందట. ఇదే నిజమైతే ప్రపంచ వేదికపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరువు పోవడం ఖాయం.
ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాల్గొనే జట్లకు అన్నింటికీ వీసాలు వచ్చేశాయి. అయితే పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి మాత్రం భారత ప్రభుత్వం ఇంకా వీసాలు జారీ చేయలేదు. మరికొన్ని గంటల్లో పాక్ టీమ్‌కి వీసాలు జారీ చేయబోతున్నారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్. ఈ మ్యాచ్‌కి 2 రోజుల ముందే పాక్ టీమ్, హైదరాబాద్‌కి రానుంది..
అక్టోబర్ 3న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడే పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది..