ICC World cup 2023: చుట్టేసే ఛాన్స్ వచ్చినా, మిస్ చేసుకున్న నెదర్లాండ్స్.. భారీ స్కోరు చేసిన పాకిస్తాన్..

49 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్... పాక్‌ని కాపాడిన మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్.. 

ICC World cup 2023: Netherlands failed to defend Pakistan for low score, after babar azam CRA

38 పరుగులకే 3 కీలక వికెట్లు పోయాయి. వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్, టాప్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కూడా పెవిలియన్ చేరారు. పాకిస్తాన్ ఇక 150 కొట్టడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే పేలవ ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్‌లతో పాకిస్తాన్‌ని చుట్టేసే అవకాశం వచ్చినా, దాన్ని ఒడిసిపట్టుకోలేకపోయింది పసికూన నెదర్లాండ్స్..

హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 49 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫకార్ జమాన్ 3 ఫోర్లతో 12 పరుగులు చేసి లోగన్ వాన్ బ్రీక్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

18 బంతులు ఆడి 5 పరుగులే చేసిన బాబర్ ఆజమ్, కోలిన్ అకెర్మాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్‌ని వాన్  మీకీరన్ అవుట్ చేయడంతో 9.1 ఓవర్లు ముగిసే సమయానికి 38 పరుగులు చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్..

అయితే సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి నాలుగో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసిన సౌద్ కీల్, ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

75 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని బస్ దే లీడే పెవిలియన్ చేర్చాడు. ఇఫ్తికర్ అహ్మద్ కూడా 9 పరుగులకే అవుట్ అయ్యాడు.

188 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. అయితే మరోసారి పాక్‌కి అవకాశం ఇచ్చారు నెదర్లాండ్ బౌలర్లు. షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కలిసి ఏడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

34 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన షాదబ్ ఖాన్‌ని బస్ దే లీడే అవుట్ చేయగా 43 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసిన నవాజ్ రనౌట్ అయ్యాడు. హసన్ ఆలీని గోల్డెన్ డకౌట్ చేశాడు బస్ దే లీడే..

అయితే ఆఖరి వికెట్‌కి హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ కలిసి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  షాహీన్ ఆఫ్రిదీ 2 ఫోర్లతో 13 పరుగులు, 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన హారీస్ రౌఫ్ స్టంపౌట్ అవ్వడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

నెదర్లాండ్స్ బౌలర్లలో బస్ దే లీడేకి 4 వికెట్లు దక్కగా కోలిన్ అకెర్మాన్ 2 వికెట్లు తీశాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios