Asianet News TeluguAsianet News Telugu

వన్డే వరల్డ్ కప్‌లో మరో సంచలనం... బంగ్లాదేశ్‌‌ని చిత్తు చేసిన నెదర్లాండ్స్!

230 పరుగుల లక్ష్యఛేదనలో 142 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ చేతుల్లో చిత్తుగా.. గ్రూప్ స్టేజీలో ఐదో పరాజయంతో సెమీస్ రేసు నుంచి అవుట్.. 

ICC World cup 2023: Netherlands beats Bangladesh, Shakib Al hasan team out of Semi final race CRA
Author
First Published Oct 28, 2023, 9:26 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పసికూన నెదర్లాండ్స్ మరో షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికాని ఓడించి షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్, తాజాగా బంగ్లాదేశ్‌ని ఓడించి ప్రపంచ కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. 230 పరుగుల లక్ష్యఛేదనలో 142 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఐదో పరాజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్, సెమీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది..

230 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కి ఏ దశలోనూ లక్ కలిసి రాలేదు. 12 బంతులు ఆడిన లిటన్ దాస్, ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన తన్జీద్ హసన్, వాన్ బీక్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 18 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, వాన్ మికీరన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

5 పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా వాన్ మికీరన్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్, బస్ దే లీడే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

ముస్తాఫికర్ రహీం 1 పరుగు చేసి వాన్ మికీరన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో మహెడీ హసన్- మహ్మదుల్లా కలిసి ఏడో వికెట్‌కి 38 పరుగులు జోడించారు..

38 బంతుల్లో 17 పరుగులు చేసిన మహెడీ హసన్ రనౌట్ కాగా 41 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన మహ్మదుల్లా, బస్ దే లీడే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, టస్కిన్ అహ్మద్ కలిసి 9వ వికెట్‌కి 29 పరుగులు జోడించారు.

35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్, అకీర్‌మన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 11 పరుగులు చేసిన టస్కిన్ అహ్మద్‌ని బస్ దే లీడ్ అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.. 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్, నిర్ణీత 50 ఓవర్లలో 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విక్రమ్ జీత్ సింగ్ 3, కోలీన్ అకీర్‌మాన్ 15 పరుగులు, వెస్లీ బర్రెసీ  41 పరుగులు, బస్ దే లీడే 17 పరుగులు చేయగా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కలిసి ఆరో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం జోడించారు.  68 పరుగులు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..

61 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్‌ని, మెహిదీ హసన్ మిరాజ్ అవుట్ చేశాడు. షరీజ్ అహ్మద్ 6 పరుగులు చేసి రనౌట్ కాగా ఆర్యన్ దత్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 4, 4, 2, 6, 1 బాదిన లోగన్ వాన్ బీక్ 19 పరుగులు రాబట్టాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన లోగన్ వాన్ బీక్ నాటౌట్‌గా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios