ICC World cup 2023: మహ్మద్ షమీ సెన్సేషనల్ స్టార్ట్... క్యాచ్ డ్రాప్ చేసిన రవీంద్ర జడేజా...
వరల్డ్ కప్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన మహ్మద్ షమీ... షమీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్‌ని డ్రాప్ చేసిన రవీంద్ర జడేజా...
మొదటి నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ... ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని సెన్సేషనల్ ఓవర్‌తో మొదెట్టాడు. మొట్టమొదటి బంతికే వికెట్ తీశాడు షమీ..
జస్ప్రిత్ బుమ్రా మెయిడిన్ ఓవర్‌తో ఇన్నింగ్స్‌ని మొదలెట్టాడు. రెండో ఓవర్‌లో ఫోర్ ఇచ్చిన మహ్మద్ సిరాజ్, నాలుగో ఓవర్‌లో వికెట్ తీశాడు. 9 బంతులు ఆడిన డివాన్ కాన్వే, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్, ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ కావాలంటూ సిగ్నల్ ఇచ్చాడు.
27 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన విల్ యంగ్‌ని మహ్మద్ షమీ, తన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ షమీ..
జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ 44 వికెట్లు తీయగా, 32 వరల్డ్ కప్ వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. 31 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లేని వెనక్కి నెట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ నాలుగు వైడ్లు వేశాడు.. ఇదే ఓవర్‌లో బంతి ఆపే క్రమంలో రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. రోహిత్ చికిత్స కోసం డ్రెస్సింగ్ రూమ్‌కి చేరగా కెఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.
మొదటి పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది న్యూజిలాండ్. 11వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో రెండో బంతికి రచిన్ రవీంద్ర అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించాడు. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది..
టీవీ రిప్లైలో బంతి బ్యాటుకి తగలనట్టు స్పష్టంగా కనిపించింది. అదో ఓవర్‌లో రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. జడ్డూ చేతుల్లో పడిన బంతి, బౌన్స్ అయిన కిందపడిపోవడంతో 12 పరుగుల వద్ద రచిన్ రవీంద్రకు లైఫ్ దక్కింది.. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా డ్రాప్ చేసిన మొదటి క్యాచ్ ఇదే..