Asianet News TeluguAsianet News Telugu

వీడు మళ్లొచ్చాడా... ఇండియా- ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ప్రత్యేక్షమైన జార్వో...

సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి వచ్చిన ఇంగ్లాండ్ పిచ్ ఇన్వేడర్ జార్వో... ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు వెళ్లి... 

ICC World cup 2023: Jarvo 69, famous England pitch invader appears in India vs Australia WC match CRA
Author
First Published Oct 8, 2023, 2:37 PM IST

ఇండియా- ఇంగ్లాండ్ మధ్య 2021 ఆగస్టులో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎక్కువగా పాపులర్ అయ్యాడు జార్వో. 69 జెర్సీ నెంబర్‌తో క్రీజులోకి వచ్చిన జార్వోని పోలీసులు బయటికి ఈడ్చుకెళ్లారు. అయితే నాలుగు టెస్టుల సిరీస్‌లో జార్వో ఒకటి, రెండు కాదు, ఏకంగా మూడు సార్లు పోలీసుల కళ్లు గప్పి, స్టేడియంలోకి వచ్చి... సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు..

ఇంగ్లాండ్‌కి చెందిన ఈ క్రికెట్ ఫ్యాన్, ఇప్పుడు ఇండియాలో ప్రత్యేక్షమయ్యాడు. చెన్నైలో ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జార్వో  హడావుడి చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి వచ్చిన జార్వో, ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు వెళ్లాడు..

జార్వోతో మాట్లాడిన విరాట్ కోహ్లీ, ఇలా చేయకూడదని హెచ్చరించడం కెమెరాల్లో స్ఫష్టంగా కనిపించింది. ఇంగ్లాండ్- ఇండియా టెస్టు సిరీస్ సమయంలో చాలా సార్లు స్టేడియంలోకి వచ్చిన జార్వోపై పోలీస్ కేసు నమోదు చేసిన పోలీసులు, అతనికి స్టేడియంలోకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 

మానసిక రుగ్మతతో బాధపడుతున్న జార్వో, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇలా చాలా మ్యాచులకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.  వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇండియాకి వచ్చిన జార్వో, ఇంగ్లాండ్ ఆడిన మ్యాచ్‌లో కాకుండా టీమిండియా మ్యాచ్‌లో కనిపించి హడావుడి చేయడం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios