Asianet News TeluguAsianet News Telugu

ICC World Cup 2023: దీపావళి రోజున సంప్రదాయ దుస్తుల్లో భారత క్రికెటర్ల జోష్

దీపావళిని పురస్కరించుకొని  భారత క్రికెట్ జట్టు సభ్యులు  సంప్రదాయ దుస్తుల్లో  పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచకప్ పోటీల్లో వరుస విజయాలను సాధిస్తున్న భారత క్రికెట్ జట్టు  వరుస విజయాలను సాధిస్తున్న విషయం తెలిసిందే.

  ICC World Cup 2023: Inside Team India's Diwali bash (WATCH) lns
Author
First Published Nov 12, 2023, 12:31 PM IST

న్యూఢిల్లీ:  దీపావళి పర్వదినం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు సంప్రదాయబద్ద దుస్తులు ధరించారు.అంతేకాదు దీపావళి సందర్భంగా గెట్ టూ గెదర్ కార్యక్రమంలో  భారత క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.  ఆదివారంనాడు  బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో  భారత, నెదర్లాండ్స్  క్రికెట్ జట్ల మధ్య  ప్రపంచకప్ వన్ డే మ్యాచ్ ఉంది.ఈ మ్యాచ్ కు  కొద్ది గంటల ముందు  భారత క్రికెటర్లు దీపావళిని పురస్కరించుకొని ధరించి సంతోషంగా ఉన్న ఫోటోను బీసీసీఐ  సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీపావళి సందర్భంగా నిర్వహించిన గెట్ టూ గెదర్ లో  పాల్గొన్న టీమ్ ఇండియ సభ్యుల్లో పండుగ స్పూర్తి కన్పించింది.  ఇప్పటివరకు  జరిగిన అన్ని మ్యాచుల్లో  భారత క్రికెట్ జట్టు విజయాలు సాధించింది.  ఆడిన ప్రతి మ్యాచ్ లో  భారత్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.  ఈ నెల  15న  న్యూజిలాండ తో తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో  ఇండియా ఆడనుంది.

ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో  రెండు రోజుల క్రితం ముంబైలో  ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా త్రీడీ  ప్రొజెక్షన్ ను అందించాయి. 2023  ప్రపంచకప్ లోని కొన్ని మరపురాని క్షణాలను  రెండు నిమిషాల పాటు ప్రదర్శించారు.  పురుషుల ప్రపంచ కప్ బ్రాండ్ ప్రచారాన్ని  ఇట్ టేక్స్ వన్ డే ని ఆకర్షణీయమైన రీతిలో ప్రదర్శించారు.

ప్రస్తుత ప్రపంచకప్ పురుషుల క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శించారు.  అంతేకాదు  క్రికెట్ అభిమానులు, మ్యాచ్ లోని ఆసక్తికర  సన్నివేశాలు,  ప్రేక్షకులు, క్రికెటర్ల విభిన్న భావోద్వేగాలను  ప్రదర్శించారు.  దాదాపుగా  40 వేల అత్యాధునిక  ల్యూమన్ ప్రొజెక్టర్ల ద్వారా ఈ ప్రదర్శనను నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా  క్రికెట్ ప్రేమికులకు  ఈ ప్రదర్శన మరుపురాని అనుభూతిని మిగిల్చింది. 

 

వెస్టిండీస్  ధిగ్గజ క్రికెటర్, ఐసీసీ  పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023  అంబాసిడర్ సర్ వివ్ రిచర్డ్స్  ఈ వేడుకలను  చూసి తన ఆనందం వ్యక్తం చేశారు.మిగిలిన మ్యాచ్ లలో  కూడ  మరిన్ని ఉత్కంఠభరితమైన  మ్యాచ్ లు జరిగే అవకాశం ఉందని రిచర్డ్స్  ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios