ICC World cup 2023 Final: ఆఖరి ఆటలో అదే తడ‘బ్యాటు’... ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్...

ICC World cup 2023 Final: 3 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్... హాఫ్ సెంచరీలు చేసుకున్న విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్... తీవ్రంగా నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా... 

ICC World cup 2023 Final:  Team India failed to score decent target in Final, India vs Australia CRA

ఏళ్లు గడిచినా, టీమిండియాకి ఫైనల్ ఫోబియా వదల్లేదు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా 10 మ్యాచులు ఆడిన భారత జట్టు, ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..  7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన  రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ పట్టిన సూపర్ క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. 

ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 పరుగులు చేయగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని అధిగమించేశాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. 63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 8వ సారి 50+ స్కోరు చేసి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా 22 బంతులు ఆడి 9 పరుగులు చేసి నిరాశపరిచాడు.  107 బంతులు ఆడిన కెఎల్ రాహుల్, ఒకే ఒక్క బౌండరీతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ బ్యాటును తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. 10వ ఓవర్ నుంచి 40వ ఓవర్ మధ్య భారత జట్టు కేవలం రెండే రెండు ఫోర్లు రాబట్టింది..  

10 బంతుల్లో ఓ ఫోర్ బాదిన మహ్మద్ షమీ 6 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 3 బంతులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా ఒక్క పరుగు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.  భారీ షాట్లు ఆడతాడు, స్కోరును పెంచుతాడని అనుకున్న సూర్యకుమార్ యాదవ్.. సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశాడు. 28 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫోర్‌తో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

వరల్డ్ కప్‌లో తొలిసారి బ్యాటింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్ 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా కుల్దీప్ యాదవ్ 10 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios