Asianet News TeluguAsianet News Telugu

కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ అవుట్! ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా... ఇక సూర్యడిపైనే భారం...

ICC World cup 2023 Final: 66 పరుగులు చేసి అవుట్ అయిన కెఎల్ రాహుల్... 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ... 211 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా..  

ICC World cup 2023 Final: KL Rahul, Mohammed Shami goes, Team India lost 7 wickets in no time CRA
Author
First Published Nov 19, 2023, 5:24 PM IST

అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 107 బంతులు ఆడిన కెఎల్ రాహుల్, ఒకే ఒక్క బౌండరీతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ బ్యాటును తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. 10వ ఓవర్ నుంచి 40వ ఓవర్ మధ్య భారత జట్టు కేవలం రెండే రెండు ఫోర్లు రాబట్టింది.. 

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.. 
7 బంతుల్లో 4 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన  రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ పట్టిన సూపర్ క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. 

ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 పరుగులు చేయగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని అధిగమించేశాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. 63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 8వ సారి 50+ స్కోరు చేసి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా 22 బంతులు ఆడి 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. 10 బంతుల్లో ఓ ఫోర్ బాదిన మహ్మద్ షమీ 6 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..  211 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా.. 

Follow Us:
Download App:
  • android
  • ios