Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: డేవిడ్ మలాన్ సెంచరీ! బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్...

England vs Bangladesh: డేవిడ్ మలాన్ సెన్సేషనల్ సెంచరీ.. హాఫ్ సెంచరీలు చేసిన జానీ బెయిర్‌స్టో, జో రూట్... 4 వికెట్లు తీసిన మెహిదీ హసన్..

 

ICC World cup 2023: Dawid Malan Century, England scored huge total against Bangladesh CRA
Author
First Published Oct 10, 2023, 2:36 PM IST | Last Updated Oct 10, 2023, 2:36 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేయగా డేవిడ్ మలాన్ సెన్సేషనల్ సెంచరీ చేశాడు. 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, వన్డేల్లో ఆరో సెంచరీ బాదాడు..

జో రూట్ 68 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా హారీ బ్రూక్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. హారీ బ్రూక్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ డకౌట్ కాగా సామ్ కుర్రాన్ 11, క్రిస్ వోక్స్‌ 14, అదిల్ రషీద్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మార్క్ వుడ్ 5, రీస్ టోప్లే 1 పరుగు చేశారు..

బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ 4 వికెట్లు తీయగా షోరిఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీశాడు. టస్కిన్ అహ్మద్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios