ICC World cup 2023: బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ! ఇఫ్తికర్, షెఫీక్ మెరుపులు... భారీ స్కోరు చేసిన పాకిస్తాన్...
Pakistan vs Afghanistan: 58 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, 74 పరుగులు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్... ఆఖర్లో షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ మెరుపులు..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగుల స్కోరు చేసింది...
ఓపెనర్లు అబ్దుల్లా షెఫీక్, ఇమామ్ ఉల్ హక్ కలిసి తొలి వికెట్‌కి 56 పరుగులు జోడించారు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
బాబర్ ఆజమ్, అబ్దుల్లా షెపీక్ కలిసి రెండో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. 75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
మహ్మద్ రిజ్వాన్ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి అవుట్ కాగా 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన సౌద్ షకీల్, మహ్మద్ నబీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 92 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వన్డేల్లో 30వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
206 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ కలిసి ఆరో వికెట్‌కి 45 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు..
మొదటి 3 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చిన అజ్ముతుల్లా ఓమర్‌జాయ్, ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో 6, 4, 4 తో 16 పరుగులు ఇవ్వగా, ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో 3 వైడ్లతో 16 పరుగులు సమర్పించాడు. 38 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.