క్రీడలను మించిన గురువు లేడు... గొప్ప పాఠాలు నేర్పిస్తాయి : టీమిండియా ఓటమిపై ఆనంద్ మహింద్రా
వరల్డ్ కప్ 2023 లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఓటమిని చవిచూసి ఏకంగా ట్రోఫీనే కోలోపోయింది టీమిండియా. ఇలా ఫైనల్లో ఓడిన బాధలోవున్న భారత క్రికెటర్లకు వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా మద్దతుగా నిలిచారు.
ముంబై : ఈ ప్రపంచ కప్ ముగింపు బాగాలేకున్నా టోర్నీ మొత్తం టీమిండియా అద్భుతంగా ఆడింది. రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ వరల్డ్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. అయితే ఈ ఓటమి భారత క్రికెట్ ఫ్యాన్స్ ను బాధించినా టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వరల్డ్ కప్ గెలవలేకపోవచ్చు... కానీ టోర్నీ మొత్తం చాలా అద్భుతంగా ఆడి మా మనసులు గెచుకున్నారంటూ భారత ఆటగాళ్ళ ఓటమి బాధను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఆటలో గెలుపు ఓటములు సహజం... గెలుపుతో పొంగిపోయి, ఓటమితో కుంగిపోవడం ఆటగాళ్ల లక్షణం కాదంటున్నారు భారతీయ క్రికెట్ ఫ్యాన్స్. తనదికాని రోజు ఎంతటి గొప్ప జట్టయినా ఓడిపోతుంది... అలాంటి రోజే నిన్న భారత్ కు ఎదురయ్యిందంటూ టీమిండియా ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు అభిమానులు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా కూడా టీమిండియాకు మద్దతుగా నిలిచారు.
అణకువగా వుండటం నేర్పించడంలో క్రీడను మించిన గురువు లేడని ఆనంద్ మహింద్రా అన్నారు. ఈ ప్రపంచకప్ లో టీమిండియా గొప్ప క్రికెట్ ఆడింది... ఏరకంగా చూసినా అద్భుతంగా రాణించిందని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆడింది. కానీ ఫైనల్ లో మాత్రం అనుకోకుండా ఓడిపోయింది... ఈ సమయంలోనే మనందరం రోహిత్ సేనకు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని ఆనంద్ మహింద్రా సూచించారు.
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ద్వారా తాను ఒకటి నేర్చకున్నానని ఆనంద్ మహింద్ర అన్నారు. ఒకరి బాధలో ఉన్నవారిని భావాలను అర్థంచేసుకోవాలి... వారి కాళ్లుపట్టి కిందకు లాగకుండా ముందుకు వెళ్లేలా సహకరించాలని అన్నారు. జీవితంలో ముందుకు సాగాలంటే కేవలం విజయాలనే కాదు ఓటమిని కూడా అంగీకరించాలని ఆనంద్ మహింద్రా అన్నారు.
Read More టీమిండియా కొంపముంచిన ఆ ఇద్దరి గాయాలు... కెఎల్ రాహుల్ పరమ జిడ్డు బ్యాటింగ్‌కి...
ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా ప్రస్తుతం తన పరిస్థితి ఇలానే వుందంటూ ఓ ఫోటోను షేర్ చేసారు. ఇలా టీమిండియా గెలిచినప్పుడు అభినందించి... ఇప్పుడు ఓటమి బాధలో వున్న ఆటగాళ్లకు ఆనంద్ మహింద్రా మద్దతుగా నిలిచారు.