Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్... శార్దూల్ ఠాకూర్‌కి ఛాన్స్..

India vs Afghanistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  ఆఫ్ఘనిస్తాన్... రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి ఛాన్స్.. 

ICC World cup 2023: Afghanistan won the toss and elected to bat, Shardul Thakur comes in CRA
Author
First Published Oct 11, 2023, 1:44 PM IST | Last Updated Oct 11, 2023, 1:54 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియా,నేడు ఆఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయినా రెండో మ్యాచ్‌లోనూ అదే నిర్ణయం తీసుకోవడం విశేషం..

మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఛేదించి, బోణీ కొట్టిన భారత జట్టు... నేటి మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగుతోంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ యంగ్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా ద్వారా కూడా విరాట్ కోహ్లీని ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనల తర్వాత విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీని ఎంజాయ్ చేసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

గత మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్,ఇషాన్ కిషన్ నేటి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ బౌలర్లను ఓ ఆటాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌కి ముందు వీరి నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వస్తే, టీమ్‌లో రెట్టింపు ఉత్సాహం నిండుతుంది. 

ఆఫ్ఘానిస్తాన్ జట్టు: రెహ్మనుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జాద్రాన్, రెహ్మత్ సా, హస్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జాద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ వుర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios