ICC World cup 2023: అదరగొట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్లు, 4 వికెట్లు తీసిన బుమ్రా... టీమిండియా ముందు..

ఆఫ్ఘాన్‌ని ఆలౌట్ చేయలేకపోయిన టీమిండియా బౌలర్లు.. 80 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీ,  62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌... 4 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా.. 

ICC World cup 2023:  Afghanistan scored big score, Jasprit bumrah picks 4 wickets, India vs Afghanistan CRA

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదటి మ్యాచ్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్‌ని భారత టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్ ఆలౌట్ చేయలేకపోయింది. ఢిల్లీతో  టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, 8 వికెట్లు కోల్పోయి 272 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్‌ని అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌, కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ కలిసి ఆదుకున్నారు.

జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో వైడ్ రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన రెహ్మాత్ షా కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు..

63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. అజ్మతుల్లా ఓమర్‌జాయ్, ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ కలిసి నాలుగో వికెట్‌కి 128 బంతుల్లో 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.. 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు..

88 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 80 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీని కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసిన నజీబుల్లా జాద్రాన్, బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన మహ్మద్ నబీ, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు..

235 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. సిరాజ్ బౌలింగ్‌లో 4, 6 బాదిన రషీద్ ఖాన్ 14 పరుగులు రాబట్టాడు. 12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన రషీద్ ఖాన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ముజీబ్ వుర్ రెహ్మాన్ 2 ఫోర్లతో 10 పరుగులు చేయగా  నవీన్ ఉల్ హక్ ఓ ఫోర్ బాది 9 పరుగులు చేశాడు. 

భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా హార్ధిక్ పాండ్యాకి 2 వికెట్ల దక్కాయి. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ వికెట్ తీయకపోగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios