Under 19 World Cup: సెంచ‌రీతో చెల‌రేగిన టీమిండియా యంగ్​స్టర్ ముషీర్ ఖాన్..

India U19 vs New Zealand U19: అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భార‌త యంగ్ ప్లేయ‌ర్ ముషీర్ ఖాన్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. టోర్నీలో రెండో సెంచరీ బాదాడు. 
 

ICC Under-19 World Cup 2024: India's youngster Musheer Khan strikes with a century; The second in this World Cup RMA

Musheer Khan: ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్-2024లో టీమిండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచ్ ల‌ను గెలిచిన భార‌త్ సూప‌ర్ సిక్స్ లోకి ప్ర‌వేశించింది. మంగ‌ళ‌వారం న్యూజిలాండ్-భార‌త్ ల మ‌ధ్య సూప‌ర్ సిక్సులో తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త్ నిల‌క‌డగా ఆడుతోంది. అయితే, ఈ మ్యాచ్ లో భార‌త్ యంగ్ ప్లేయ‌ర్ ముషీర్ ఖాన్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. 109 బంతుల్లో ముషీర్ ఖాన్ సెంచ‌రీ కొట్టాడు.

ఈ మ్యాచ్ కు ముందు రోజు ముషీర్ ఖాన్ సోద‌రుడు సర్ఫరాజ్ ఖాన్ భారత సీనియర్ జట్టులో ఎంపికయ్యాడు. మరుసటి రోజే ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించి సంచలనంగా మారాడు. సూప‌ర్ సిక్సులో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జ‌రిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ అద్భుత బ్యాటింగ్ తో అల‌రించాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచ‌రీ బాదాడు.

ముషీర్ ఖాన్ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అత‌ని అద్భుతమైన ఇన్నింగ్స్ ల‌తో ముషీర్ ఖాన్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ముషీర్ ఖాన్ ప్ర‌స్తుతం 121* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. భార‌త్ 258/5 (46) ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తోంది.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios