Asianet News TeluguAsianet News Telugu

U19 World Cup 2024 Final:  అండర్‌-19 అంతిమ సమరం నేడే.. టైటిల్‌ పోరులో ఆసీస్ తో భారత్‌ అమీతుమీ..

U19 World Cup 2024 Final: అండర్‌-19 ప్రపంచకప్‌లో అంతిమ సమరానికి వేళైంది. టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.  ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో ఉన్న భారత్ ఈ పోరులో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంటుందో లేదో? ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దాం.. 

ICC U19 World Cup 2024  India vs Australia Final: Key player battles to watch out for KRJ
Author
First Published Feb 11, 2024, 9:21 AM IST

U19 World Cup 2024 Final: ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా భారత్ చేరుకుంది. ఆదివారం బెనోనిలో విల్లోమూర్ పార్క్‌ వేదికగా జరుగనున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియాతో తలపడనున్నది. ఉద‌య్ స‌హార‌న్ నేతృత్వంలో యువ భార‌త జ‌ట్టు వరుస విజయాలతో దూసుకపోతోంది.

ఈ సారి  ఎలాగైనా టైటిల్ గెలుస్తుందని , భారత కెప్టెన్ ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్ జోడీ ఈసారి రోహిత్ -విరాట్ కోహ్లి కల నెరవేర్చుతారని టీమిండియా అభిమానులు ధీమాగా ఉన్నారు. గత రికార్డులను పరిశీలించిన ఇప్పటికే ఈ టోర్నీ చరిత్రలో రెండు (2012, 2018) సార్లు ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌ కప్పు సొంతం చేసుకుంది. అలాగే.. టీమిండియా వరుసగా  అయిదో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.  కాగా.. 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమికి ప్రతీకారంగా యంగ్ టీమిండియా.. ఫైనల్‌ పోరులో ఆసీస్ ను చిత్తుగా ఓడిస్తుందనీ,  టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


యంగ్ టీమిండియా బ్యాటింగ్ లోనూ.. బౌలింగ్ లోనూ రాణిస్తోంది. మరోవైపు ఫిల్డింగ్ లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. టోర్నీలో  టీమిండియా అన్ని దశల్లో విజయం సాధించి.. అజేయంగా  ఫైనల్‌ చేరింది. కెప్టెన్ ఉదయ్ సహారన్ నాయకత్వంలో యంగ్ టీమిండియా దూసుకెళ్తోంది.  అతడు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సచిన్‌ దాస్‌ , సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ పరుగుల వేట కొనసాగిస్తున్నారు. ఈ టోర్నీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా ఉదయ్ అగ్రస్థానంలో నిలిచాడు.

6 మ్యాచ్‌ల్లో 389 పరుగులు చేశాడు. ఇందుదులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఉదయ్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాడు. ఐర్లాండ్‌పై ఉదయ్ 75 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 81 పరుగులు చేశాడు. ఇప్పుడు ఫైనల్స్‌లోనూ అద్భుతాలు చేయగలరని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

అలాగే.. ముషీర్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్స్ గా నిలిచారు. ముషీర్ 6 మ్యాచ్‌ల్లో 338 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో  అతను 2 సెంచరీలు కూడా చేశాడు. టోర్నీలో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల్లో తొలి స్థానాల్లో వరుసగా ఉదయ్‌ (389), ముషీర్‌ (338) ఉన్నారు. ముఖ్యంగా సెమీస్‌లో 245 పరుగుల ఛేదనలో 32కే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఉదయ్‌, సచిన్‌ అసాధారణ పోరాటంతో జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు బౌలింగ్‌లో స్పిన్నర్‌ సౌమి పాండే (17), పేసర్‌ నమన్‌ తివారి (10) కీలకం కానున్నారు.
 

ఫైనల్‌లో ఆస్ట్రేలియా సవాల్‌ను భారత్ ఎదుర్కోనుంది. ఆసీస్ నుంచి టీం ఇండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది.ఈ  జట్టు కూడా అజేయంగా తుదిపోరు చేరింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో హ్యారీ డిక్సన్ దంచికొట్టాడు. ఆసీస్ తరఫున హ్యారీ 6 మ్యాచ్‌ల్లో 267 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా  నిలిచారు. మరోవైపు..  బ్యాటింగ్‌లో విబ్జెన్‌ 256 పరుగులతో సత్తాచాటుతున్నారు. మన బౌలర్లు  వీరికి కళ్లెం వేయాల్సింది. ఇక పేసర్లు స్రేటకర్‌ (12), విడ్లర్‌ (12)లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. వీటన్నింటిని ఎదుర్కొంటే.. యంగ్ టీమిండియా టైటిల్ కైవసం చేసుకోవడం సులభమే. 

Follow Us:
Download App:
  • android
  • ios