Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: బంగ్లాను రఫ్ఫాడించిన రబాడ.. 84 పరుగులకే చాప చుట్టేసిన వైనం

SA vs BAN: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేదు. సఫారీ బౌలర్ రబాడ.. బంగ్లాను తన బౌలింగ్ తో దడదడలాడించాడు. సఫారీ బౌలర్ల ధాటికి ఐదుగురు బంగ్లా బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు.

ICC T20 World cup 2021: bangladesh set 85 Runs Target For South Africa
Author
Hyderabad, First Published Nov 2, 2021, 5:23 PM IST

ఐసీసీ టీ20  ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-1లో దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సఫారీ బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా పులులు.. నిర్ణీత 20 ఓవర్లలో 84  పరుగులకే ఆలౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రఫ్ఫాడించాడు. సఫారీ బౌలర్ల ధాటికి ఐదుగురు బంగ్లా బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేదు. సఫారీ బౌలర్ రబాడ.. బంగ్లాను తన బౌలింగ్ తో దడదడలాడించాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. తొలి ఓవర్ ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తో వేయించాడు.  ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన రబాడ.. వరుసబంతుల్లో రెండు వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. 

నాలుగో ఓవర్లో ఐదో బంతిని నయీమ్ (9) ను ఔట్ చేసిన రబాడ.. చివరి బంతికి సౌమ్య సర్కార్ (0) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. 

ఇక ఆ తర్వాత ఓవర్ వేసిన రబాడ.. బంగ్లాకు మరో షాకిచ్చాడు. ఆరో ఓవర్ మూడో బంతికి ముష్ఫీకర్ రహీం (0) ను ఔట్ చేశాడు. ఎనిమిదో ఓవర్లో  నార్జ్.. బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా (3) ను   పెవిలియన్ కు పంపాడు.  8 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 34-4. 

 

ఆ తర్వాత  బంగ్లా వికెట్ల పతనం వేగంగా సాగింది. క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ కు నడిచారు. అఫిఫ్ హుస్సేన్ (0), షమిమ్ హుస్సేన్ (11), టస్కిన్ అహ్మద్ (0)  క్రీజులో నిలవడానికి ఆపసోపాలు పడ్డారు. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా నిలదొక్కుకునేలా ఆడలేదు. బంగ్లా బ్యాటర్లలో ఓపెన్ లిటన్ దాస్ (36 బంతుల్లో 24), మెహది హసన్ (25 బంతుల్లో 27) మాత్రమే రాణించారు. బంగ్లా ఇన్నింగ్స్ లో హసన్ (27) టాప్ స్కోరర్. సఫారి బౌలర్ల ధాటికి  ఐదుగురు బంగ్లాదేశ్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

 

సఫారి బౌలర్లలో రబాడ.. నార్జ్ మూడు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. స్పిన్నర్ షంషి కి రెండు వికెట్లు దక్కగా.. ప్రిటోరియస్ ఒక వికెట్ పడగొట్టాడు.  కాగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడి ఓటమి పాలైన బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి తప్పుకోగా దక్షిణాఫ్రికా రెండు మ్యాచులలో గెలిచి సెమీస్ బెర్త్ కోసం ఆడుతున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios