Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్.. టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు: చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఐసీసీ

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడగా... అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ICC reacts on staging T20 World Cup amid Coronavirus crisi
Author
Dubai - United Arab Emirates, First Published Apr 17, 2020, 8:35 PM IST

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడగా... అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే కోవిడ్ 19 తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

Also Read:ఐపీఎల్‌‌ను నిర్వహిస్తాం: శ్రీలంక ప్రతిపాదనపై బీసీసీఐ స్పందన

ఈ విషయం ఐసీసీ దాకా వెళ్లడంతో... తగిన సమయంలో పొట్టి ప్రపంచకప్‌పై స్పందిస్తామని తెలిపింది. ‘‘ షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్‌ను నిర్వహించాలని భావిస్తున్నామని.. అయితే వేగంగా పరిస్ధితులు మారుతుండటంతో ఆకస్మిక ప్రణాళికలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఐసీసీ వెల్లడించింది.

కరోనాను దృష్టిలో ఉంచుకుని తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని.. నిపుణులు, అధికారులు, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరిశీలించి బాధ్యాతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి చెప్పింది.

మరోవైపు ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ను నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదనలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వంటి వారు తోసిపుచ్చారు.

Also Read:ఐపీఎల్ వల్లే... అంటూ కోహ్లీ సేన పై క్లార్క్ అనుచిత వ్యాఖ్యలు: దిగ్గజాల ఫైర్

ఈ మెగాటోర్నీని అభిమానుల మధ్య నిర్వహించాలని వీరు కోరారు. అయితే మాజీ క్రికెటర్లు సైమన్ కటిచ్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ప్రపంచకప్‌ను వాయిదా వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios