Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS : లక్ష గొంతుకలు ఏకమై జాతీయ గీతాలాపన.. దద్దరిల్లిన మోడీ స్టేడియం, రోమాలు నిక్కబొడిచే వీడియో

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. దాదాపు లక్ష మంది ఈ మ్యాచ్‌కు హాజరైనట్లు అంచనా. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో స్టేడియం ‘‘ జనగణమణ’’ తో హోరెత్తిపోయింది. 

ICC ODI World Cup 2023 - IND vs AUS : Over 1 Lakh Fans Unite in a Stirring Rendition of the Indian National Anthem ksp
Author
First Published Nov 19, 2023, 3:51 PM IST | Last Updated Nov 19, 2023, 3:52 PM IST

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. భారత్ మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు క్రికెట్ లవర్స్. ఫైనల్ నేపథ్యంలో దేశ ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అలాగే క్లబ్బులు, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే దేశంలోని పలు నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌ తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. 

బయటే పరిస్ధితి ఇలా వుంటే.. స్వయంగా మ్యాచ్‌కు హాజరైన వారి ఆనందానికి అవధులు వుండవు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోడీ మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. భారత అభిమానులు టీమిండియా జెర్సీలను ధరించి మన క్రికెటర్లను ఉత్సాహపరుస్తున్నారు. దాదాపు లక్ష మంది ఈ మ్యాచ్‌కు హాజరైనట్లు అంచనా. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో స్టేడియం ‘‘ జనగణమణ’’ తో హోరెత్తిపోయింది. జాతీయ గీతంలోని పద్యాలను ప్రేక్షుకులు, క్రికెటర్లు, మైదాన సిబ్బంది ప్రతిధ్వనించారు. తద్వారా స్టేడియంలో దేశభక్తి వెల్లివెరిసింది.

ఈ సామూహిక జాతీయ గీతాలాపనను చూసిన వారి వెన్నులో వణుకుపుట్టింది. ఐక్యత, గుర్తింపుకు చిహ్నంగా స్టేడియమంతటా జనగణమణ ప్రతిధ్వనించింది. ఈ సన్నివేశం చూసినవాళ్లకి గూస్‌బంప్స్ ఖాయం. ఇదే సమయంలో 500 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, అభిమానుల చేతుల్లో గంభీరంగా రెపరెపలాడటం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవైపు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ వుండగా.. మరోవైపు జాతీయ గీతం ప్రతిధ్వని మ్యాచ్‌ను మరింత ఉన్నతంగా నిలబెట్టింది. క్రికెట్‌పై అభిమానం, దేశభక్తిని ప్రేక్షకులు ఏకకాలంలో చూపారు. 

జాతీయ గీతాన్ని ఆలపించిన అనుభవం అభిమానుల మధ్య బంధాన్ని సృష్టించింది. ఇది నరేంద్ర మోడీ స్టేడియంను సామూహిక భావోద్వేగాల పుణ్యక్షేత్రంగా మార్చింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు  జాతీయ గీతాలాపన ద్వారా ఈ ఈవెంట్‌ను మరుపురాని జ్ఞాపకంగా మిగిల్చారు. లక్షకు పైగా స్వరాలు ఒకేసారి పాడటం, సగర్వంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా ఇది కేవలం మ్యాచ్ కాదు.. సరిహద్దులను దాటి ఒక దేశాన్ని ఏకం చేసే ఆత్మ . 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios