ICC New Rule : ఐసీసీ కీలక నిర్ణయం.. అలా చేస్తే ఇక 5 రన్స్ పెనాల్టీ..
ICC New Rule : ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓడీఐ క్రికెట్, టీ20 ఫార్మాట్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నియమానికి స్టాప్ క్లాక్ అని పేరు పెట్టారు. దాని వల్ల ఏం మార్పులు జరగనున్నాయంటే ?
ICC New Rule : క్రికెట్ వరల్డ్ కప్ - 2023 ముగిసిన నేపథ్యంలో ఐసీసీ క్రికెట్ నియమాలను మార్చింది. ఆటలో వేగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లకు కూడా టైమ్ అవుట్ వంటి నిబంధనలను రూపొందించింది. ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి కొత్త ఓవర్‌ను ప్రారంభించడానికి 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు జరిమానా విధిస్తారు. ఈ విషయాన్ని క్రికెట్ పాలకమండలి ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ నిబంధన ప్రస్తుతం పురుషుల క్రికెట్‌లో వన్డే, టీ20 ఫార్మాట్లకు వర్తిస్తుంది.
rajasthan assembly elections 2023 : డేరాబాబాకు మరోసారి పెరోల్..! ఎన్నికల స్టంటేనా?
అయితే ప్రస్తుతం ఈ నియమం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని వల్ల ఉపయోగాలు, మ్యాచ్ పై పడే ప్రభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దానిని శాశ్వతంగా అమలు చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు పురుషుల ఓడీఐ, టీ20 క్రికెట్‌లో ట్రయల్ ప్రాతిపదికన స్టాప్ క్లాక్‌ని అమలు చేయడానికి సీఈసీ అంగీకరించింది. ఓవర్ల మధ్య సమయాన్ని తగ్గించడానికి ఈ క్లాక్ ఉపయోగపడనుంది.
Top Stories : తెలంగాణలో తొలి ఓటు, పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారతాలు..సొరంగంలో కార్మికులు క్షేమం...
అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో పిచ్‌పై నియంత్రణ ఉన్న విధానాన్ని కూడా ఐసీసీ మార్చింది. “పిచ్, అవుట్‌ఫీల్డ్ పర్యవేక్షణ నియమాలలో కూడా మార్పులు జరిగాయి. ఇవి పిచ్‌లను మూల్యాంకనం చేసే ప్రమాణాలను ఈజీ చేస్తాయి. ఒక పిచ్‌కు ఐదేళ్లలోపు ఐదు డీమెరిట్ పాయింట్లు లభిస్తే, దానిని నిషేధించాలనేది మునుపటి నిబంధన. ఇప్పుడు దాని పరిమితిని ఆరు డీమెరిట్ పాయింట్లకు తగ్గించారు. ఇప్పుడు ఐదేళ్లలో ఆరు డీమెరిట్ పాయింట్లు పొందిన ఏ గ్రౌండ్ అయినా నిషేధించడుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది.
Miracle: పసిఫిక్ పై నుంచి వెళ్లుతుండగా విమానం పైకొప్పు ఊడిపోయింది.. అనూహ్యంగా..! మిరాకిల్ స్టోరీ ఇదే
కాగా.. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలో శ్రీలంక క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించారు. అయితే అండర్ - 19 ప్రపంచ కప్ 2024 కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. దానిని దక్షిణాఫ్రికాకు అందజేసింది. దీంతో పాటు ఒక ఆటగాడు మగవాడిగా పెరిగి, కౌమారదశలో అతని శరీర మార్పులు ఆడ పిల్లల మాదిరిగానే ఉంటే, అతడు లింగమార్పిడి చేయించుకున్నప్పటికీ మహిళల క్రికెట్‌లో ఆడటానికి అర్హుడు కాదని ఐసీసీ నిర్ణయించింది.