సారాంశం

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీని స్టేడియంలో లైవ్ చూసిన 1 లక్షా 90 వేల మంది.... ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని స్టేడియంలో వీక్షించిన 5,42,000 మంది... 

భారతీయులకు ఉండే ప్రధాన కాలక్షేపాలు సినిమా, క్రికెట్... అందుకే ఓటు వేయడానికి అరగంట లైన్‌లో నిలబడడానికి కూడా ఓపిక లేని మనుషులు, సినిమా చూసేందుకు, క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిలబడతాయి. తాజాగా ఇండియా ఆతిథ్యం ఇస్తున్న మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, గత ఐసీసీ రికార్డులన్నీ తుడిచి పెట్టేసింది..

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీని 1 లక్షా 90 వేల మంది స్టేడియంలో లైవ్ చూశారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ఇప్పటికే 5,42,000 మంది స్టేడియంలో వీక్షించారు. ఇది క్రికెట్ టోర్నీ చరిత్రలోనే అత్యధికం...

వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇప్పటికే టీవీల్లో 123.8 బిలియన్ల మినెట్స్ వీక్షించారు. 2019 మొత్తం టోర్నీ కంటే ఇది 43 శాతం ఎక్కువ... లైవ్ బ్రాడ్‌కాస్ట్‌ని ఇప్పటిదాకా వీక్షించిన డిజిటల్ యూజర్ల సంఖ్య 364.2 మిలియన్లను దాటింది. క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యధికం. 

ఇండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లో రియల్ టైం 4.3 కోట్లుగా నమోదైంది. డిజిటల్ స్పోర్ట్స్ ఈవెంట్ చరిత్రలో ఇదే వరల్డ్ రికార్డు...

ఐసీసీ సోషల్ మీడియా అకౌంట్స్‌కి కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కారణంగా బీభత్సమైన ట్రాఫిక్ వస్తోంది. వీడియో వ్యూస్ 314 శాతం పెరగగా, వెబ్‌సైట్ వ్యూస్‌ 40 శాతం పెరిగాయి. సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కూడా 30 శాతానికి పైగా పెరిగిందని ఐసీసీ ప్రకటించింది..