Asianet News TeluguAsianet News Telugu

Rohit Sharma: అటు కెప్టెన్ గా.. ఇటు బ్యాట‌ర్ గా అద‌ర‌గొట్టిన రోహిత్ శ‌ర్మ‌..

World Cup 2023: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 లో భార‌త కెప్టెన్ గానే కాకుండా, ఒపెనింగ్ బ్యాట్స్ మ‌న్ గా కూగా రోహిత్ శ‌ర్మ ప‌రుగుల వ‌రద పారించాడు. భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేర‌డంలో రోహిత్ శ‌ర్మ ఇన్నింగ్స్ కీల‌కంగా ఉన్నాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.
 

ICC Cricket World Cup 2023: Rohit Sharma is the captain as well as the batsman RMA
Author
First Published Nov 18, 2023, 4:48 AM IST

ICC Cricket World Cup 2023: ప్రస్తుత ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. టీం ఇండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు నవంబర్ 19 ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్‌లో తలపడనుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత, 'మ్యాన్ ఇన్ బ్లూ' అహ్మదాబాద్ చేరుకోగా, అక్క‌డ ఐటీసీ నర్మదా హోటల్‌లో ఘన స్వాగతం లభించింది. అయితే, వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఓట‌మెరుగ‌ని టీమిండియా ప్ర‌యాణంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కృషి ప్ర‌శంస‌నీయం.

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 లో భార‌త కెప్టెన్ గానే కాకుండా, ఒపెనింగ్ బ్యాట్స్ మ‌న్ గా కూగా రోహిత్ శ‌ర్మ ప‌రుగుల వ‌రద పారించాడు. భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేర‌డంలో రోహిత్ శ‌ర్మ ఇన్నింగ్స్ కీల‌కంగా ఉన్నాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఎందుకంటే.. మ్యాచ్ ప్రారంభంలో ప‌రుగుల వ‌ర‌ద‌ల పారించ‌డంతో త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్ మ‌న్ పై ఒత్తిడి ప‌డ‌కుండా భారీ స్కోర్ చేయ‌డం మంచి ఫ‌లితాల‌ను అందించాయి. ఈ వ‌రల్డ్ క‌ప్ లో రోహిత్ శ‌ర్మ త‌న ప‌ది ఇన్నింగ్స్ లో 55.00 యావ‌రేజ్, 124.15 స్ట్రైక్ రేటుతో మొత్తం 550 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట్స్ మ‌న్ జాబితాలో టాప్-5 లో ఉన్నాడు. త‌న ఇన్నింగ్స్ లో 62 ఫోర్లు, 28 సిక్సులు ఉండ‌టం విశేషం. ఒక సెంచ‌రీతో పాటు మూడు ఆఫ్ సెంచ‌రీలు చేసి బ్యాట్ తో రాణించాడు. 

2023 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇలా.. 

న్యూజిలాండ్‌పై 47 పరుగులు- ముంబ‌యి వేదిక‌గా నవంబర్ 15 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో.. 
నెదర్లాండ్స్ పై 61 పరుగులు (12 నవంబర్, బెంగళూరు)
సౌతాఫ్రికాపై 40 పరుగులు (నవంబర్ 5, కోల్‌కతా)
శ్రీలంక పై 4 పరుగులు (2 నవంబర్, ముంబయి)    
ఇంగ్లాండ్ పై 87 పరుగులు (29 అక్టోబర్, లక్నో)
న్యూజిలాండ్ పై 46 పరుగులు (22 అక్టోబర్, ధర్మశాల)
బంగ్లాదేశ్ పై 48 పరుగులు (19 అక్టోబర్, పూణె)
పాకిస్థాన్ పై 86 పరుగులు (14 అక్టోబర్, అహ్మదాబాద్)
ఆఫ్ఘనిస్తాన్ పై 131 పరుగులు (11 అక్టోబర్, ఢిల్లీ)
ఆస్ట్రేలియా 0 పరుగులు ( 8 అక్టోబర్, చెన్నై)

ప్రపంచకప్ లో ఫైనల్ వ‌ర‌కు భారత్‌ ప్రయాణం.. 

తొలి మ్యాచ్‌: చెన్నైలో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం
రెండో మ్యాచ్:  ఢిల్లీలో ఆఫ్ఘానిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 
మూడో మ్యాచ్: న‌రేంద్ర మోడీ స్టేడియాలో నేదర్లాండ్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 
నాల్గో మ్యాచ్:  ఫూణేలో బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 
ఐదో మ్యాచ్: ధ‌ర్మ‌శాల‌లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం. 
ఆరో మ్యాచ్: ల‌క్నోలో ఇంగ్లాండ్ పై 100 ప‌రుగుల భారీ తేడాతో గెలుపు. 
ఏడో మ్యాచ్:  ముంబ‌యిలో శ్రీలంక‌పై ఏకంగా 302 ప‌రుగుల తేడాతో ఘ‌న విజయం. 
8వ మ్యాచ్:  కోల్ క‌తాలో సౌతాఫ్రికాపై 243 ప‌రుగుల తేడాతో విజ‌యం. 
9వ మ్యాచ్:  బెంగ‌ళూరులో నెద‌ర్లాండ్స్ పై 160 ప‌రుగుల తేడాతో గెలుపు. 
10వ మ్యాచ్- సెమీ ఫైన‌ల్:  ముంబ‌యిలో న్యూజీలాండ్ పై 70 ప‌రుగుల తేడాతో ఘ‌న విజయం. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న‌వంబ‌ర్ 19 (ఆదివారం) ఫైన‌ల్ పోరు జ‌ర‌గ‌నుంది. భార‌త్ -ఆస్ట్రేలియాలు ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ను కైవ‌సం చేసుకోవ‌డానికి పోటీ ప‌డ‌నున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios