India vs Australia: ఇప్పటివరకు వ‌న్డే ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 150 IND vs AUS హెడ్ టు హెడ్ ఫైట్ లో ఆస్ట్రేలియా 83 విజయాలతో ఉండ‌గా, భారత్ 57 విజయాలతో ఉంది. అయితే 10 మ్యాచ్‌లు ఫలితాలు తేల‌లేదు.   

World Cup 2023 Final: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 తుదిపోరుకు చేరుకుంది. ఈ మెగా టోర్న‌మెంట్ లో ఒక్క ఓట‌మి లేకుండా భార‌త్ జ‌ట్టు త‌న జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తూ ఫైన‌ల్ కు చేరుకుంది. ఇదే రికార్డును కొన‌సాగించి.. క‌ప్పుకొట్టి టోర్నమెంట్‌ను అజేయంగా ముగించాలని రోహిత్ శ‌ర్మ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, పాట్ కమిన్స్ నాయ‌క‌త్వంలోని ఆస్ట్రేలియా లీగ్ దశలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనీ, భార‌త్ ను ఓటించి క‌ప్పు ఎగురేసుసుకు పోవాల‌ని ఆసీస్ చూస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గిన మ్యాచ్ ల్లో విజ‌యాలు, ఓట‌ముల గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే.. 

ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో హై స్కోరింగ్ సెమీ-ఫైనల్ 1లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. రెండో సెమీ-ఫైనల్ లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇక భార‌త్-ఆస్ట్రేలియా ఇరు జట్లు ఇప్పుడు వ‌న్డే ఫార్మాట్‌లో 151వ సారి, 2011 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌తో సహా మూడోసారి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వ‌న్డే హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. 

ఇప్పటివరకు వ‌న్డే ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 150 IND vs AUS హెడ్ టు హెడ్ ఫైట్ లో ఆస్ట్రేలియా 83 విజయాలతో ఉండ‌గా, భారత్ 57 విజయాలతో ఉంది. అయితే 10 మ్యాచ్‌లు ఫలితాలు తేల‌లేదు. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. 83 విజయాలలో, ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 49 సార్లు, ఛేజింగ్‌లో 34 సార్లు గెలిచింది. అయితే భారత్ ఛేజింగ్‌లో 33 సార్లు, లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు 24 సార్లు గెలిచింది.

IND vs AUS గణాంకాలు.. 

గణాంకాలు    IND vs AUSAUS vs IND
అత్యధిక స్కోర్
 
 399/5  389/4
అత్యల్ప స్కోర్63 ఆలౌట్101 ఆలౌట్
ఫస్ట్ బ్యాటింగ్‌లో గెలుపు.. 2449

ఛేజింగ్‌లో గెలుపులు
3334
అత్యధిక పరుగులు (ఆల్ టైమ్)సచిన్ టెండూల్కర్ (3077 పరుగులు)రికీ పాంటింగ్ (2164 పరుగులు)
అత్యధిక పరుగులు (ప్రస్తుతం)రోహిత్ శర్మ (2332 పరుగులు)స్టీవ్ స్మిత్ (1306 పరుగులు)
 అత్యధిక స్కోరర్ (వ్యక్తిగతం)రోహిత్ శర్మ (209)జార్జ్ బెయిలీ (156)
అత్యధిక వికెట్లు (ఆల్ టైమ్)కపిల్ దేవ్ (45)బ్రెట్ లీ (55)
అత్యధిక వికెట్లు (ప్రస్తుతం)       
 
రవీంద్ర జడేజా (37)ఆడమ్ జంపా (34)
అత్యుత్తమ బౌలింగ్మురళీ కార్తీక్ (6/27)మిచెల్ స్టార్క్ (6/43)

  
ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు దేశాలు ఇప్పటివరకు పదమూడు సార్లు పోటీ ప‌డ్డాయి. ఆస్ట్రేలియాతో భారత్‌పై 8-5 ఆధిక్యం ఉంది. 2023 ప్రపంచకప్‌లో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

IND vs AUS వ‌ర‌ల్డ్ క‌ప్ రికార్డులు ఇలా ఉన్నాయి..

గణాంకాలు    IND vs AUSAUS vs IND
గెలుపులు58
ఓటములు85
ఫస్ట్ బ్యాటింగ్ గెలిచినవి37
ఛేజింగ్ లో గెలిచినవి21
అత్యధిక స్కోర్352359
అత్యల్ప స్కోర్ 125129