Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఈసారి వికెట్ కీపర్ ను మారుస్తా.. పంత్ ను ఏడిపించిన విరాట్ కోహ్లి

kohli-pant: వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో జరుగనున్న కీలక పోరుకు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  ఈసారి కీపర్ ను  మారుస్తానని హింట్ ఇచ్చాడు. 

Iam Thinking to change the wicket keeper: virat kohli teases rishabh pant in new star sports add
Author
Hyderabad, First Published Oct 26, 2021, 6:23 PM IST

పొట్టి ప్రపంచకప్ (T20 World cup2021) లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్ ముగిశాక భారత జట్టు.. వచ్చే ఆదివారం న్యూజిలాండ్ (Newzealand)ను ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ గెలవడం టీమిండియా (Team India)కు అత్యావశ్యకం. తర్వాతి మూడు  మ్యాచ్ లు  నామమాత్రపు జట్లుగానే పరిగణిస్తున్నా టీ20లలో ఎవరు ఎప్పుడు ఎలా విజృంభిస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే కీలక పోరుకు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat kohli).. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  ఈసారి కీపర్ ను  మారుస్తానని హింట్ ఇచ్చాడు. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఈ టోర్నీకి అఫిషియల్ బ్రాడ్ కాస్ట్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న స్టార్ స్పోర్ట్స్ (Star sports)వినూత్న యాడ్ లతో జనాలను అలరిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు యాడ్ లు విజయవంతమయ్యాయి. అందులో  మోకా మోకా అయితే బంపర్ హిట్. ఇక విరాట్ కోహ్లి,  రిషభ్ పంత్ లతో రూపొందించిన యాడ్ కూడా భాగానే హిట్ అయ్యింది. తాజాగా స్టార్ స్పోర్ట్స్ మరో కొత్త యాడ్ ను రూపొందించింది. 

స్కిప్పర్ కాలింగ్ కీపర్ హ్యాష్ ట్యాగ్ తో స్టార్ స్పోర్ట్స్ ఈ యాడ్ ను ట్విట్టర్ లో పోస్టు చేసింది.  వీడియోలో కోహ్లి, పంత్ లు మాట్లాడుకుంటుండగా.. 
పంత్: విరాట్ భయ్యా.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో గెలవడానికి నాకు ఒక ఫ్యాన్ సూపర్ ఐడియా చెప్పాడు. వికెట్ పడ్డ ప్రతిసారి గ్లవ్స్ మార్చమని అడ్వైజ్ చేశాడు. 
కోహ్లి:  అవునా..? అలా అయితే సిక్సర్ కొట్టిన ప్రతిసారి నేను  బ్యాట్ మార్చాలా..? 
పంత్ : హా.. గెలవాలంటే మార్పులు జరగాలి కదా భయ్యా. 
కోహ్లి: ఈసారి నేను వికెట్ కీపర్ ను మార్చాలని అనుకుంటున్నాను.
పంత్ : భయ్యా...!
కోహ్లి : ఇవన్నీ మానేసి గేమ్ మీద దృష్టి నిలుపు.. అని అంటాడు. 

 

ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. తర్వాత మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను ఢీకొనబోతున్నది. అయితే ఐసీసీ టోర్నీలలో భారత్ కు కివీస్ మీద గొప్ప రికార్డేమీ లేదు. ఇరు జట్లు ఐసీసీ టోర్నీలలో భారత్ తో న్యూజిలాండ్ ఆడిన గత ఆరు మ్యాచ్ లలో కివీస్ 5 సార్లు గెలుపొందింది. ఒక్కసారే భారత్ గెలిచింది. 

గత 6 ఐసీసీ ఈవెంట్లలో బారత్-న్యూజిలాండ్: 
 

2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ : 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. 
2019 వరల్డ్ కప్ సెమీస్ : మాంచెస్టర్ లో జరిగిన 2019 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ లో భారత్ గుండె పగిలిన క్షణం. 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. 
2016 టీ20 ప్రపంచకప్: నాగ్పూర్ లో జరిగిన మ్యాచ్ లో కివీస్ 47 పరుగుల తేడాతో ఇండియాను ఓడించింది. 
2007 ప్రపంచకప్: జోహన్నస్బర్గ్ లో జరిగిన వన్డేలో భారత్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 
2003 ప్రపంచకప్:  సూపర్6 మ్యాచ్ లో సౌరబ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు.. ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. 

భారత్-న్యూజిలాండ్ ల మధ్య ఇప్పటివరకు 16 టీ20 లు జరుగగా.. 8-6 తో కివీస్ దే పైచేయి గా ఉంది. ఈ గణాంకాల నేపథ్యంలో వచ్చే ఆదివారం నాటి పోరులో భారత్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios